మనం సాధారణంగా ఏడు వారాల నగలు అని వినే ఉంటాం. పాత కాలం సినిమా లలో ఈ ఏడు వారాల నగలు అని ఎక్కువ గా వినిపిస్తుంది. విక్రమార్కుడు అనే సినిమా లో కూడా ఒక సందర్భంలో ఏడు వారాల నగలు అని వినిపిస్తుంది. అయితే ఏడు వారాల నగలు అంటే ఎమిటో ఎప్పుడు అయినా ఆలోచించారా. దాని గురించి తెలుసు కోవాలని ప్రయత్నించారా. అయితే దాని గురించి పూర్తి సమాచారం లభించలేదా. అయితే ఇప్పుడు మనం ఏడు వారాల నగల గురించి పూర్తి గా తెలుసుకుందాం. పూర్వ కాలంలో ప్రజలు గ్రహా దోహాలను ఎక్కువగా నమ్ముతారు అందు చేత అన్ని గ్రహాలను సంతృప్తి పరచాలని అనుకుంటారు.
Advertisement
అందు కోసం ప్రతి రోజు వారానికి ఏడు రోజుల పాటు ఒక్కో గ్రహాం పేరు మీద వివిధ రకలైన బంగారు అభరణాలు ధరించే వాళ్లు. స్త్రీ, పురుషులు అని బేధం లేకుండా ఇద్దరు వారానికి ఏడు రోజుల పాటు బంగారు ఆభరణాలు ధరించే వాళ్లు. అందుకే ఏడు వారాల నగలు అని పేరు వచ్చింది. అయితే ఈ ఏడు వారాలలో ఏ రోజు ఎలాంటి ఆభరణాలు ధరిస్తారో తెలుసుకుందాం.
Advertisement
ఆదివారం : ఆది వారం రోజు సూర్య భగవంతుడిని ప్రార్థిస్తారు. సూర్యుడి కోసం ఆది వారం పొదిగిన కమ్మలు కెంపులు ధరిస్తారు.
సోమవారం : సోమవారం చంద్రుడి కోసం ముత్యాలతో కూడిన హారాలు, గాజులు ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల చంద్రడి ప్రభావం మన పై పడదని అంటారు.
మంగళ వారం : కుజ దోషం ఉపశమనానికి కుజ గ్రహాం కోసం పగడాలు ఉన్న దండలు, ఉంగరాలను ధరిస్తారు.
బుధ వారం : బుధ వారం బుధుడి అనుగ్రహం కోసం గాజులు, చెవి దిద్దులు, పచ్చల పతకాలు ధరిస్తారు.
గురువారం : బృహస్పతి గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి బంగారు ఉంగారాలు, కమ్మలు, హారాలు ధరిస్తారు.
శుక్రవారం : శుక్రుడి కోసం ముక్కు పుడక, గాజులు, వజ్రాల హారాలు ధరిస్తారు.
శనివారం : శని ప్రభావం పడకుండా నీలమణి హారాలను ధరిస్తారు.