సాధారణం గా ప్రతి ఇంట్లో బీరువ ఉంటుంది. ఆ బీరువా ఎక్కువ శాతం పడక గది లోనే ఉంటుంది. అయితే చాలా మంది బీరువా విషయంలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. దీని వల్ల బీరువాలోకి లక్ష్మీ దేవి రావడానికి ఇబ్బంది పడుతుంది. అయితే బీరువాల విషయంలో చేసే చిన్న చిన్న తప్పులు ఎంటి.. అనే దానికి గురించి తెలుసుకుందాం. సాధారణం గా చాలా మంది తమ పడక గది లో ఉండే బీరువా పై దేవుడి బొమ్మలు, పొస్టర్లను అతికిస్తారు.
Advertisement
Advertisement
అయితే పడక గది లో ఉండే బీరువాలపై ఎలాంటి దేవుడి ఫోటోలను అతికించకూడదని వాస్తు నిపుణలు చెబుతున్నారు. కానీ బీరువాపై ఒక పక్క శుభం లాభం మరో వైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి. అలాగే స్వస్తిక్ కూడా అపసవ్య స్వస్తిక్ కాకుండా సవ్య స్వస్తిక్ మాత్రమే ఉండేలా చూడాలి. అది కూడా పసుపు రంగులో కుంకుమ తో బొట్లు పెట్టినట్టు ఉండాలి. ఇలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని వాస్తు పండితులు చెబుతారు. అలాగే బీరువా ఎప్పుడూ కూడా ఇంట్లో నైరుతి వైపు మాత్రమే ఉంచాలి. అలాగే బీరువ ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉంచాలి. బీరువా తెరవగానే మంచి సువాసన వచ్చేలా ఉండాలి.
చెడు వాసన వస్తే ఆ బీరువాలో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. కుబేర ముగ్గును నీలం రంగు తో వేసి నాలుగు వైపులా పసుపు, కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే సువాసన వచ్చే విధంగా పచ్చకర్పూరము తో పాటు సుగంధ ద్రవ్యాల్ని వెండి కప్పులో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన వృద్ధి జరుగుతుంది.