సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి రోజులు గడుస్తున్నా విడాకుల ప్రభావం మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇద్దరూ ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరి జీవితంలో వారు బిజీగా ఉన్నారు.
Advertisement
వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ పై దృష్టి పెట్టారు. కానీ నెటిజన్లు మాత్రం సమంత నాగచైతన్య అంశాన్ని ఇంకా మర్చిపోలేదు. ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఎక్కువగా సమంతను ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు.
ఇప్పటికే సమంత తనపై వస్తున్న ట్రోల్స్ పై ఎమోషన్ అయ్యారు కూడా. అయినప్పటికీ సమంతకు మాత్రం ట్రోల్స్ తప్పడం లేదు. ఇక తాజాగా ఓ నెటిజన్ సమంత పై దారుణంగా కామెంట్స్ చేశాడు. దాంతో సమంత అతడికి చెంప చెళ్లుమనిపించేలా రిప్లై ఇచ్చింది. “సమంత విడాకులు తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్.. ఒక జెంటిల్మెన్ నుండి ఫ్రీ గా రూ. 50 కోట్లు దోచుకుంది. అంటూ నెటిజన్ సమంతను టాగ్ చేశాడు.
Advertisement
ఆ ట్వీట్ పై సమంత స్పందిస్తూ నీ ఆత్మకు దేవుడు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో చాలా బాగా బుద్ధి చెప్పావ్ అంటూ సమంతకు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే విడాకుల సమయంలో సమంత ఎలాంటి భరణం తీసుకోలేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పెళ్లికి ముందే భరణం పై ఇద్దరూ అగ్రిమెంట్ చేసుకున్నట్టు కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021