Home » IND VS NZ : అమ్మ చూస్తుండగా..ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన సిరాజ్..

IND VS NZ : అమ్మ చూస్తుండగా..ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన సిరాజ్..

by Bunty

హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ అభిమానులకు అసలు మజాను పంచింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తోలుత గిల్ సిక్సర్లతో విరుచుకుపడి డబుల్ సెంచరీ సాధించగా, అనంతరం కివిస్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్ వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ తో మ్యాచ్ పై ఆసక్తి రేకెత్తించాడు. కానీ చివర్లో టీమిండియా బౌలర్లు రాణించడంతో భారత్ మూడు వన్డేలా సిరీస్ లో 1-0 ఆదిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇది ఇలా ఉండగా, కివిస్ విజయానికి ఆఖరి 6 ఓవర్లలో 65 పరుగులు అవసరం కాగా, వీరిద్దరి జోరు చూస్తే పర్యాటక జట్టే గెలుస్తుందనిపించింది. ఈ దశలో బౌలింగ్ కు దిగిన హార్దిక్ పాండ్యా 45వ ఓవర్లో ఆరు పరుగులే ఇవ్వడంతో కివీస్ పై ఒత్తిడి పెరిగింది. కివీస్ విజయానికి 30 బంతులు 59 పరుగులుగా సమీకరణం మారింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ లోకల్ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి మూడు బంతుల్లో సిరాజ్ రెండు పరుగులు ఇవ్వడంతో కివీస్ బ్యాటర్ల పై ఒత్తిడి పెరిగింది. దీంతో భారీ షాట్ కు యత్నించిన శాంటర్న్ సూర్య కుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

తర్వాత బంతికి షిప్లేను సిరాజ్ బౌల్డ్ చేశాడు. హైదరాబాది పెసర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో భారత్ తిరిగి రేసులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా బ్రాస్వెల్ ఫోర్లు, సిక్స్ లు కొట్టినప్పటికీ అవతలి ఎండ్ లో షాట్లు ఆడేవాళ్లు లేకపోవడంతో ఆఖరి ఓవర్లో భారత్ గెలుపొందింది. హైదరాబాదులో తొలి వన్డే మ్యాచ్ ఆడిన సిరాజ్ పది ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అందులో రెండు మెయిడిన్లు కూడా ఉన్నాయి. సొంత ఊర్లో, కుటుంబ సభ్యులు చూస్తుండగా, అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన సిరాజ్, అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌ అనంతరం.. ట్వీట్‌ కూడా చేశాడు సిరాజ్‌. హైదరాబాద్‌ ఆడటం, మ్యాచ్‌ గెలవడం చాలా ఆనందంగా ఉందన్నాడు సిరాజ్‌.

Visitors Are Also Reading