న్యూజిలాండ్ పై బుధవారం తొలి వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుబ్ మాన్ డబుల్ సెంచరీ తో మెరుపులు మెరూపించాడు. దీంతో అంతర్జాతీయంగా వన్డే క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన పదవ ఆటగాడిగా గిల్ నిలిచాడు. అయితే, ఇప్పటివరకు టీమిండియా తరపున ఎవరెవరు డబుల్ సెంచరీలను సాధించారు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
# సచిన్ టెండూల్కర్
2010లో దక్షిణాఫ్రికాపై అజేయంగా 200 పరుగులు చేయడం ద్వారా పురుషుల వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బాట్స్ మాన్ గా సచిన్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా కూడా నిలిచాడు.
# వీరేంద్ర సెహ్వాగ్
2011లో వెస్టిండీస్ పై 211 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును సేహ్వాగ్ బద్దలు కొట్టాడు.
# రోహిత్ శర్మ
Advertisement
2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేసిన రోహిత్ శర్మ 2017లో శ్రీలంకపై 208 పరుగులతో అజేయంగా మెరిశాడు. దీని తర్వాత 2014లో శ్రీలంక పై 264 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంటే వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు, మూడుసార్లు డబుల్ సెంచరీ సాధించిన రికార్డు హిట్ మ్యాన్ పేరిట ఉంది.
# ఇషాన్ కిషన్
బంగ్లాదేశ్ పై 210 పరుగులు చేసి టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. బంగ్లాదేశ్ పై 126 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేయడం ద్వారా వేగంగా డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్మెన్ గా ఇషాన్ కిషన్ ఇప్పుడు ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాక ఈ ఫీట్ చేసిన తొమ్మిదవ ఆటగాడిగా కూడా నిలిచాడు.
#శుబ్ మాన్ గిల్
శుబ్ మాన్ కూడా నిన్నటి మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేశాడు.
READ ALSO : సావిత్రి ఇంట్లో ఉన్న బీరువాల కొద్దీ బంగారం… కూతురు విజయచాముండేశ్వరి సంచలన వ్యాఖ్యలు