వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా వారసుడు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమిళ తెలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దర్శకుడు నిర్మాత తెలుగు వారైనప్పటికీ విజయ్ తమిళ హీరో అవ్వడంతో ఈ సినిమాను ముందు నుండి తమిళ సినిమాగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ సినిమా పై ముందు నుండి ట్రోల్స్ వస్తున్నాయి.
Advertisement
ఈ మధ్యకాలంలో దిల్ రాజు పై నెగిటివిటీ పెరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ప్రభావం సినిమాపై కూడా పడింది. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కగా సంక్రాంతికి థియేటర్ లలో విడుదల చేశారు. కాగా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమా సీరియల్ చూసినట్టుగా ఉంది అంటూ సోషల్ మీడియాలో మీన్స్ కనిపిస్తున్నాయి.
Advertisement
దాంతో సినిమా పై వస్తున్న ట్రోల్స్ పై దర్శకుడు వంశీ పైడిపల్లి ఫైర్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూ లో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ….. ఈరోజుల్లో సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని అన్నారు. ఇదంతా టీం వర్క్ అని ప్రేక్షకులను అలరంచడానికి పడే కష్టం ఎలా ఉంటుందో మీకు తెలుసా..? అని ప్రశ్నించారు. ప్రతి సినిమా వెనక ఎన్నో త్యాగాలు ఉంటాయని అన్నారు.
మనదేశంలో సూపర్ స్టార్స్ లో విజయ్ కూడా ఒకరు అని… ప్రతి సన్నివేశానికి రిహాల్సల్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మనం ఏం చేయగలమనేది మన చేతుల్లో ఉందని.. కానీ ఫలితం మన చేతుల్లో లేదని చెప్పారు. విజయ్ తన సినిమాకు సమీక్షకుడు…విమర్శకుడు అని ఆయన కోసమే సినిమా చేశానని చెప్పారు. మరీ ఇంత నెగిటివ్ గా ఉండకూడదు అని అన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి ఇండస్ట్రీకి వచ్చానని ఈరోజు నేను ఏంటో నాకు తెలుసు అని వంశీ పైడిపల్లి ఫైర్ అయ్యారు.