ఈ సారి సంక్రాంతి మాములుగా జరుగలేదు. పందెం కోళ్ల పోటీలతో పాటు.. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య కూడా పోటీ నెలకొంది. ఈ సంక్రాంతికి బాలయ్య హీరోగా చేసిన వీర సింహారెడ్డి మరియు చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాల్తేరు వీరయ్య కామెడీ, యాక్షన్ జోనర్ లో రాగా, వీర సింహారెడ్డి మాత్రం మాస్ ఫ్యాన్స్ ను కదలించింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. అలాగే, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి.
READ ALSO : తండ్రి అయిన టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ
Advertisement
ముఖ్యంగా ఈ సినిమాలు పండగ సీజన్ ని క్యాష్ చేసుకున్నాయని చెప్పాలి. బాలయ్య, చిరంజీవి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నారు. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య రికార్డు బ్రేకింగ్ వసూళ్లు రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో అంచనాలకు మించి ఆదరణ దక్కించుకుంటుంది. యూఎస్ లో వాల్తేరు వీరయ్య $2 మిలియన్ మార్క్ కి చేరువైంది. అదే సమయంలో వీర సింహారెడ్డి $1 మిలియన్ దాటలేదు. ఓపెనింగ్ వసూళ్లలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీ కంటే ఎక్కువ వసూళ్లు నమోదు చేసింది. ఇది ఇలా ఉంచితే, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యను రాష్ట్రంలోని ఓ కుల ఆధారిత వెబ్ సైట్లు టార్గెట్ చేసినట్లు మనకు కనిపిస్తోంది.
Advertisement
వీర సింహారెడ్డి కంటే, వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువగా వసూళ్లు రాబట్టినా.. కోన్ని కుల ఆధారిత వెబ్ సైట్లు మాత్రం.. చిరంజీవి సినిమాకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తూ.. మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నాయట. ఈ సంక్రాంతికి నందమూరి సినిమా హిట్ అనే ప్రచారం జోరుగా చేస్తున్నాయట. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కాకముందు నుంచే.. ఈ ప్రచారం సాగిస్తున్నాయని టాక్. కానీ.. సంక్రాంతి విన్నర్ గా చిరు సినిమానే నిలిచిందని ఓ వర్గ మీడియా తెలపటం గమనార్హం. ఏదీ ఏమైనా.. సినిమాను సినిమాగానే చూడాలని సగటు ప్రేక్షకుడు అనుకుంటున్నారట.
READ ALSO : Kalyanam Kamaneeyam Telugu Review : కళ్యాణం కమనీయం రివ్యూ