గత కొంతకాలం నుండి అభిమానులు చిరంజీవి సినిమా కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తారు. ఎట్టకేలకు చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ జనవరి 13వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. ఈ తరుణంలో సినిమాపై ఎలాంటి టాక్ ఉంది. ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన కథలాగే ఉంది. అందులో కొత్తేమీ లేదు అంతా రొటీన్ స్టోరీ. ఈ చిత్రంలో అనేక విషయాలు బాగున్నా కానీ, బాలయ్య చిత్రంతో పోల్చుకుంటే కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఫంక్షన్ కి శృతిహాసన్ కూడా రాలేదు. ఆమె అలా రాకపోవడం వెనుక బాలయ్య డామినేషన్ కనిపించింది అని అంటున్నారు.
Advertisement
ఏది ఏమైనా సినిమా అవుట్ పుట్ చూశాక మాత్రం మెగాస్టార్ చిరంజీవి క్లియర్ గా డామినేషన్ కనిపిస్తోంది. అన్ని బాగున్న ప్రధాన సమస్య కథతోనే వచ్చింది. కానీ సినిమా విడుదలకు ముందు చిరంజీవి చాలాసార్లు నా ప్రేక్షకులకు ఏం కావాలో అదే తీశాను అంటూ చెబుతూ వచ్చారు. కానీ సినిమా చూస్తే మాత్రం అభిమానులకు కావాల్సింది ఆయన అందించలేదు అనిపిస్తోంది. ప్రేక్షకుల మనసులో చిరంజీవిని ఏ విధంగా చూడాలి అనుకున్నారో ఆ విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోయారని అంటున్నారు.
Advertisement
చిరంజీవితో సమానులైన హీరోల్లో ఇప్పటికే మమ్ముట్టి, మోహన్ లాల్ , సురేష్ గోపి వంటి వారిని చూసి చిరంజీవి నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో కమలహాసన్ కూడా సెట్ అయిపోయాడు. సినిమా కథ చిరంజీవికి అర్థం అయితే సరిపోదు. కథ కథనం ప్రేక్షకులకు కూడా నచ్చాలి ఓవరాల్ గా అభిమానులు అనుకున్న రీతిలో మాత్రం సినిమా రాలేదని చెప్పవచ్చు. ఇందులో రవితేజ మెప్పించారు. మరీ ముఖ్యంగా శృతిహాసన్ కూడా అదరగొట్టింది. ఇక చిరంజీవి ఫైట్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి సినిమా హిట్ అయితే రవితేజకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
also read:Hardik Pandya : టీమిండియా ప్లేయర్‌ను బూతులు తిట్టిన పాండ్యా..కెప్టెన్ అయ్యాక కళ్లు నెత్తికెక్కాయా ?