ఇటీవల హీరోయిన్ హంస నందిని క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని హంస నందిని యే స్వయం గా ప్రకటించింది. గతంలో ఆమె రొమ్ము క్యాన్సర్ తో పోరాడి కోలుకుంది. కాగ ప్రస్తుతం ఆమె కు మళ్లి జన్యుపరమైన క్యాన్సర్ తో పోరాడుతుంది. అయితే హంస నందినిచ కోరాన బారిన పడటం తో ఇలా ఎంత మంది హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు అనే చర్చ జోరు గా సాగుతుంది. అయితే హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడటం.. దాని నుంచి కోలుకోవడం అనేది కొత్తమే కాదు. గతంలో పలువురు హీరోయిన్స్ క్యాన్సర్ పోరాడి గెలిచిన వారు ఉన్నారు. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
1) సోనాలి బింద్రే..
టాలీవుడ్ లో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న వాళ్లలో సోనాలి బింద్రే ముందు వరస లో ఉంటారు. తెలుగు లో మన్మథుడు, మురారి, ఖడ్గం తో పాటు శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమా లలో హీరోయిన్ గా నటించింది. అయితే సోనాలి బింద్రే గతంలో హై గ్రేడ్ క్యాన్సర్ తో బాధపడింది. విదేశాల్లో చికిత్స తీసుకుని పూర్తి ఆరోగ్యం తో క్యాన్సర్ ను జయించింది. తాను మనోధైర్యంతో నే క్యాన్సర్ ను జయించానని కూడా ప్రకటించింది.
Advertisement
2) మమతా మోహన్ దాస్..
హీరోయిన్ గా సింగర్ గా తెలుగు ప్రేక్షకులకు మమతా మోహన్ దాస్ పరిచయం. కేరీర్ పరంగా మంచి హిట్ కొడుతున్న సమయం లో నే మమతా మోహన్ దాస్ కు బ్లడ్ క్యాన్సర్ కు గురి అయింది. తన 25 వ ఏట లోనే క్యాన్సర్ బారిన పడింది. అయితే పలు సార్లు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత మమత క్యాన్సర్ ను జయించింది. ప్రస్తుతం సంతోషం గా ఫ్యామిలీతో గడుపుతుంది.
3)మనీషా కొయిరాలా..
టాలీవుడ్ లో బెస్ట్ హీరోయిన్ గా మనీషా కొయిరాలా కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. మనీషా కొయిరాలా తెలుగు లో బొంబాయి, ఒకే ఒక్కడు వంటి సినిమా లలో కనిపించారు. అయితే మనీషా కొయిరాలా తన బ్లడ్ క్యాన్సర్ ను ఎంతో ధైర్యం గా ఎదుర్కొంది. కీమోథెరఫీ ద్వారా క్యాన్సర్ ను జయించి చాలా మందికి స్ఫూర్తి గా నిలబడ్డారు.
4) తహీరా కశ్యప్..
బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ కూడా క్యాన్సర్ బారిని పడ్డారు. తహీరా కశ్యప్ ఏకంగా రెండు సార్లు క్యాన్సర్ ను జయించారు. తనకు హెయిర్ లాస్ అయినా.. ఆ ఫోటో లను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ.. ధైర్యం గా క్యాన్సర్ ను జయించింది.
5) గౌతమి..
సీనియర్ హీరోయిన్ గౌతమి కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారు. గౌతమి 1980 – 90 మధ్య చాలా సినిమా లలో నటించారు. అయితే రొమ్ము క్యాన్సర్ ను గౌతమి ధైర్యం గా ఎదుర్కొని స్ఫూర్తి గా నిలిచారు. గౌతమి రొమ్ము క్యాన్సర్ ను జయించ డానికి ఏకం గా 35 సార్లు రేడియో థెరఫీ తీసుకుంది.