తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. గత కొంతకాలం నుంచి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా.. అనేక పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో ఇండస్ట్రీలోకి విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన జగతిబాబు తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇలా సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు సహాయ కార్యక్రమాల్లో కూడా ముందుంటారని చెప్పవచ్చు. అయితే జగపతిబాబు ఏ సాయం చేసినా చెప్పుకోవడానికి ఇష్టపడరు.
Advertisement
also read:సౌందర్య ఆ ఒక్క నటుడుతో అస్సలు నటించేది కాదట..కానీ ఆయన ఇప్పుడు స్టార్ అయ్యారు..!!
Advertisement
తాజాగా ఆయన ఒక పేద విద్యార్థికి సాయం అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. సైదాబాద్ కు చెందిన విజయలక్ష్మి అనే విద్యార్థికి అండగా నిలిచారు ఆయన. డిగ్రీ చదువుతున్న జయలక్ష్మి పలు సామాజిక సమస్యలపై ఎప్పుడు పోరాటాలు చేస్తూనే ఉంటుంది. కానీ ఆమెకు సివిల్స్ చదవాలని చాలా రోజుల నుంచి కోరిక ఉందట. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల తను అనుకున్నది సాధించలేక పోయింది.ఆమెను డిగ్రీ చదివించడానికి తన తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు.. తమ తల్లిదండ్రులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరించి వాటిని అమ్ముకోగా వచ్చిన డబ్బులతో జీవనాన్ని గడుపుతున్నారు. అయితే జయలక్ష్మి చదువులో టాప్..
అయితే జయలక్ష్మి గురించి ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. దీన్ని చదివిన జగపతిబాబు తల్లి ఆ అమ్మాయికి సాయం చేయాలని జగపతి బాబును సూచించింది. అమ్మ అడిగితే కాదంటారా.. వెంటనే ఆమెకు సాయం చేస్తా అని అమ్మకు మాటిచ్చారు జగపతిబాబు.. వెంటనే జయలక్ష్మి ని పిలిపించి మాట్లాడి సివిల్స్ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయం మొత్తం అందిస్తానని అన్నారు. కష్టపడి చదువుకొని సివిల్స్ సాధించాలని సూచించారు జగపతిబాబు.
also read: