తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి దంపతులు అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మరి వీరు పెళ్లి చేసుకోవడానికి ముందు లవ్ స్టోరీ ఏంటి.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు.. అనే విషయాలు చూద్దాం..స్నేహ రెడ్డి సంపన్న కుటుంబానికి చెందిన యువతి. స్నేహ రెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి జేఎన్టీయూ కు అనుసంధానంగా ఉన్న సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకీ చైర్మన్. అంతేకాకుండా ఆయన పెద్ద వ్యాపారవేత్త. స్నేహ రెడ్డి ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత విదేశాల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చింది.
Advertisement
also read:‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో నటించిన జూనియర్ విజయశాంతి గురించి మీకు తెలుసా ?
ఇక్కడ వాళ్ల నాన్న స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కొన్నాళ్లు వర్క్ చేశారు. స్నేహ రెడ్డికి సినిమాలు అంటే చాలా ఇష్టం. కానీ తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలే ఎక్కువగా చూసేది. తెలుగులో కూడా వెంకటేష్, చిరంజీవి సినిమాలు చూసేది. అలా ఓ రోజు స్నేహితుని పెళ్లి పార్టీకి స్నేహ రెడ్డి వెళ్ళింది. ఈ పార్టీకి అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు. అప్పటికి ఆయన మంచి గుర్తింపు ఉన్న హీరోనే. కాకుంటే ఇప్పుడు ఉన్నంత స్టార్డం లేదు. అల్లు అర్జున్ ఆ పార్టీలో స్నేహ రెడ్డిని చూశారు. ఆమె సింప్లిసిటీ, డ్రెస్సింగ్ స్టైల్ చూసి పడిపోయారు. ఇక పెళ్ళంటూ చేసుకుంటే ఆవిడనే చేసుకుంటానంటూ ఫిక్స్ అయిపోయారు. ఆ పార్టీలోనే అమ్మాయిని పరిచయం చేసుకొని ఆమె గురించి ఆరా తీశారు అల్లు అర్జున్. అలా ఆమెను పరిచయం చేసుకొని ఆమెతో ఎక్కువగా మాట్లాడేవాడు.
Advertisement
కానీ స్నేహ రెడ్డి నుంచి లవ్ కు సంబంధించి ఎలాంటి సమాధానం రాలేదు. కానీ అప్పటికే బన్నీపై మంచి అభిప్రాయం ఏర్పడింది స్నేహ రెడ్డికి. కానీ అతడే ప్రపోజ్ చేయాలని ఎదురు చూసింది. ఇంతలో అల్లు అరవింద్ కి ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ అమ్మాయి గురించి అన్ని విధాల ఎంక్వయిరీ చేసి ఓ రోజు ప్రపోజ్ చేశాడు. దీంతో స్నేహారెడ్డి ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకుంది. కానీ స్నేహ రెడ్డి నాన్నకు ఇష్టమే కానీ వాళ్ళ మమ్మీ కాస్త అనుమాన పడింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వాలంటే ఎక్కువగా అందంగా ఉన్న వారిని ఇష్టపడతారు. కాబట్టి స్నేహారెడ్డిని ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వడానికి కాస్త తడబడింది. కానీ చివరికి ఎలాగోలా ఇరు కుటుంబాలు వీరిద్దరి ప్రేమ వివాహాన్ని యాక్సెప్ట్ చేసి అంగరంగ వైభవంగా వివాహం చేశారు.
also read: