యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సిరి హన్మంత్. ఆ తర్వాత సీరియల్స్ మరియు చిన్న సినిమాలలోనూ సిరి నటించింది.
Advertisement
అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాత్రం సిరి అంటే చాలా మందికి పరిచయం లేదు. కానీ ప్రస్తుతం బిగ్ బాస్ లో తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. దాంతో సిరి హనుమంత్ అంటే తెలియని ప్రేక్షకులు లేకుండా పోయారు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ మొత్తం 15 వారాలు ఉండగా టాప్ 5 లో స్థానం సంపాదించి సిరి ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.
Advertisement
హౌస్ లో ఉన్న సభ్యులందరిలోనూ చిన్న వయస్కురాలు అయినప్పటికీ తన తెలివితేటలు ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. గొడవల జోలికి వెళ్లకుండా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ సిరి అభిమానులను సంపాదించుకుంది. అయితే ముందు నుండి షణ్ముఖ్ జశ్వంత్ పై ఆధారపడటం మాత్రం సిరికి కాస్త నెగెటివిటిని సంపాదించిపెట్టింది. ఎప్పుడూ టైటిల్ మీద ఫోకస్ చేయకుండా షణ్ముక్ టైటిల్ గెలుస్తాడు అంటూ కామెంట్ చేయడంతో ఆమెకు నెగిటివిటీ వచ్చిపడింది. అదే సిరి తన ఆటను తాను ఆడి ఉంటే టాప్ 3 లో ఉండేదని విజేతగా కూడా నిలిచే అవకాశం ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ టైటిల్ విజేత కాకపోయినప్పటికీ సిరి గట్టిగానే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిరి హన్మంత్ కు వారానికి లక్షా యాభై వేల నుండి రెండు లక్షల వరకు పారితోషకం ఇచ్చేలా బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో 15 వారాల పాటు సిరి హౌస్ లో కొనసాగింది కాబట్టి రూ.25 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం సిరి పాపులారిటీ పెరిగిపోయింది కాబట్టి ఆమెకు మంచి అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది.