Home » శ్రీ ముఖి డ్రెస్ పై స్టార్ హీరోయిన్ సంచలన పోస్ట్

శ్రీ ముఖి డ్రెస్ పై స్టార్ హీరోయిన్ సంచలన పోస్ట్

by Bunty
Ad

టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎవరో కాదు శ్రీముఖి. ఆమె పటాస్ షోతో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని షోలు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ షో చేసిన తర్వాత ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఎన్నో షోలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీముఖి ఇటీవల బీబీ జోడి అనే మరో డ్యాన్స్ షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

బీబీ జోడి షోలో భాగంగా వచ్చేవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఇందులో యాంకర్ శ్రీముఖి బుల్లి నిక్కర్ మాత్రమే ధరించి కనిపించింది. దీంతో ఈమె వేసుకున్న ఈ డ్రెస్ ఓ రేంజ్ లో హైలైట్ అవుతోంది. చాలామంది దీనిపై తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ఫలితంగా శ్రీముఖి పేరు విపరీతంగా మారుమ్రోగిపోతోంది.

Advertisement

బీబీ జోడి షోలో యాంకర్ శ్రీముఖి ధరించిన షార్ట్ డ్రెస్ పై సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఈ మేరకు తెలుగు హీరోయిన్ మాధవి లత దీనిపై తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో స్టోరీ కూడా పెట్టింది. అందరూ శ్రీముఖి బాడీకి ఆ డ్రెస్ సెట్ కాలేదు అంటూ కామెంట్ చేసింది. అలాగే, కొన్ని విలువైన సలహాలను కూడా ఇచ్చింది. దీంతో ఇది హాట్ టాపిక్ అవుతోంది. మాధవి లత తన పోస్టులో ‘శ్రీ, నువ్వు మోడ్రన్, అల్ట్రా మోడ్రన్ డ్రెస్సులు వేసుకో. కానీ, అవి నీ బాడీకి సెట్ అయ్యేలా చూసుకో. కళ్ళకు నచ్చితే కాదు, బాడీకి నప్పాలి. అప్పుడు చూడ్డానికి బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. తద్వారా ఈ షార్ట్ డ్రెస్ శ్రీముఖికి అసలు సెట్ కాలేదని ఆమె అభిప్రాయపడింది.

Visitors Are Also Reading