అప్పట్లో విలన్ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది రఘువరన్ మాత్రమే.. సన్నగా పొడుగ్గా కళ్లద్దాలు ధరించి ఒక విలక్షణమైన నటుడిగా ఉండేవారు రఘువరన్. ఆయన నటన అభినయం ప్రత్యేకమని చెప్పవచ్చు. ఆయన మాట విధానం , డైలాగ్ ఉచ్చారణ ముఖ కదలికలు చాలా స్పెషల్ గా ఉండేవి. అందుకే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగాడు. ఆయన ఎక్కువగా విలన్ పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపుగా 200 పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు.
Advertisement
also read;ఎంతో బ్యాగ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలో ఎదగలేక పోతున్న నటులు.. ఎవరంటే..?
అలాంటి రఘువరన్ కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మొదటగా కన్నడ భాషలో ఒక మూవీలో చిన్న పాత్ర చేశాడు. ఆ విధంగా తెలుగులో కూడా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ అంచలంచెలుగా ఎదిగాడు. 1979 నుంచి 83 వరకు చెన్నైలోని యాక్టింగ్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్నారు. 1996లో ప్రముఖ నటి,డబ్బింగ్ ఆర్టిస్ట్ రోహిణి ని మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. ఆ తర్వాత 2004లో రోహిణి రఘువరన్ లు విడాకులు తీసుకున్నారు.
Advertisement
ఆయన తెలుగులో సుస్వాగతం, ఆహా, శివ, నాగ, జానీ, మాస్ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. అయితే రఘువరన్ 2008 మార్చ్ 19న మరణించాడు. ఇదంతా పక్కన పెడితే రఘువరన్ ఆ విధంగా మ*నికి అలవాటు పడడానికి ప్రధాన కారణం ఆయన ప్రేమ విఫలం కావడమే అని సమాచారం. అప్పట్లో రఘువరన్ ఓ స్టార్ హీరోయిన్ ని చాలా ఇష్టపడ్డారట. కానీ ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదని అదే బాధతో రఘువరన్ dra* కి మ*నికి బానిస అయ్యారని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా ఆ స్టార్ హీరోయిన్ వల్ల తన కెరీర్నే పాడు చేసుకున్నారని చెప్పవచ్చు.
also read;మంటల్లో చిక్కుకున్న పంత్ ను కాపాడిన చిరు ఉద్యోగి.. సాహసానికి హ్యాట్సాఫ్..!!