Tollywood Actor Janardan: తెలుగు సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి.. సీనియర్ టాలెంటెడ్ నటులంతా ఒక్కొక్కరిగా ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. 2022లో సీనియర్ నటులు హీరోలైనా రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, మొన్నటికి మొన్న కైకాల సత్యనారాయణ, చలపతిరావు, తాజాగా వల్లభనేని జనార్ధన్ ఇండస్ట్రీ నుంచి శాశ్వతంగా దూరమయ్యారని చెప్పడం బాధాకరం. అలాంటి వల్లభనేని జనార్ధన్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించాడు. ఆయన ఇండస్ట్రీలో ఉన్న టాప్ ధనవంతులలో ఒకరిగా చెప్పవచ్చు..
Tollywood Actor Janardan Movies:
also read:Rishabh Pant : కారు యాక్సిడెంట్‌లో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్‌కు గాయాలు
Advertisement
మరి అలాంటి జనార్ధన్ ఎన్ని కోట్ల ప్రాపర్టీస్ కలిగి ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.. 1959 సెప్టెంబర్ 25న ఏలూరు జిల్లాలో జన్మించాడు జనార్ధన్. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం. తన కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో స్థిరపడ్డాడు. జనార్ధన్ కు సినిమాలపై ఉన్న ఆసక్తి వల్ల ఇండస్ట్రీలో రాణించాడు. తన కెరియర్ స్టార్టింగ్ లోనే సొంత బ్యానర్ స్థాపించి “అమ్మగారి మనవలు” అనే చిత్రాన్ని మొదలుపెట్టాడు. కానీ ఈ మూవీ మధ్యలోనే ఆగింది. ఆ తర్వాత కన్నడ హిట్ చిత్రమైన మానస సరోవర్ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా పెట్టి ‘ అమాయక చక్రవర్తి’ అనే చిత్రానికి డైరెక్షన్ చేశారు. ఈ విధంగా అనేక దర్శకుడిగా చేసిన జనార్ధన్ తన మామ విజయ బాపినీడితో ” మహా జనానికి మరదలు పిల్ల” అనే సినిమాను తెరకెక్కించారు.
Advertisement
అంతేకాకుండా బాపినీడు డైరెక్షన్లో వచ్చిన అనేక చిత్రాల్లో తాను కూడా నటుడిగా చేశారు. ఈ విధంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జనార్ధన్ బాగానే సంపాదించారు.. బాపినీడు ఇండస్ట్రీలోకి రాకముందే కోటీశ్వరుడు. అప్పట్లోనే తన తాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టాప్ బిజినెస్ మాన్ లలో ఒకరిగా పేరు సంపాదించారు. తన తాత గారి నుంచి జనార్ధన్ కు 400 కోట్లకు పైగానే ఆస్తి వచ్చిందని తెలుస్తోంది. అంతేకాకుండా జనార్ధన్ తన సొంత టాలెంట్ తో సినిమాలు, బిజినెస్ లు చేస్తూ దాదాపుగా 1400 కోట్లకు పైగానే స్థిర , చరాస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈయన ఆస్తుల విలువ శోభన్ బాబు ఆస్తులను మించి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అంతటి ఘన నటుడు మృతి చెందడంతో ఆయన అభిమానులు శోకశాంద్రంలో మునిగారు.
also read:పురుషుడు చూసే చూపును బట్టి స్త్రీ ఏమని అర్థం చేసుకుంటుందో తెలుసా…?