టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా రాణిస్తున్న వాళ్ళలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టింది. కానీ మొదటి సినిమా విజయం సాధించలేదు. ఆ తరవాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కెరటం అనే సినిమా తో రకుల్ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత సినిమాలు హిట్ అయ్యాయి.
Advertisement
దాంతో రకుల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది. కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టి అక్కడ కూడా స్టార్ స్టేటస్ అందుకుంది. తెలుగు లో రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా రకుల్ సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం అమ్మడి డిమాండ్ చాలా తగ్గిపోయింది.
Advertisement
దాంతో బాలీవుడ్ లో మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇదిలా ఉంటే సినీ కేరీర్ సో సో గా ఉన్న ఈ బ్యూటీ లవ్ లో మునిగి తేలుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కొంత కాలంగా లవ్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ అమ్మడి బాయ్ ఫ్రెండ్ కూడా సెలబ్రెటినే…..బాలీవుడ్ నటుడు మరియు నిర్మాత అయిన జాకీ బద్నాని తో రకుల్ లవ్ లో పడింది.
ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు లవ్ లో ఉన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది రకుల్ జాకీ పెళ్లి జరగబోతుంది అంటూ టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేసిన రకుల్ తన ప్రేమ విషయాన్ని సైతం బయటపెట్టింది. కాగా వారిద్దరి ఫోటో ఇప్పుడు నెట్టింట చకర్లు కొడుతోంది.