Sai kumar Wife: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు సాయికుమార్. డైలాగ్ చెప్పాలన్నా,పోలీస్ పాత్రలో అదరగొట్టాలన్నా సాయికుమార్ ను మించిన నటుడు లేరని చెప్పవచ్చు. సాయికుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఆ తర్వాత స్టార్ హీరోగా మారారు. తన తండ్రి పిజె శర్మ డబ్బింగ్ వారసత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయికుమార్ సినిమాల్లో హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నారు. తండ్రి ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనా కానీ తన కెరియర్ బిగినింగ్ లో చాలా కష్టాలు పడ్డారు సాయికుమార్. వారిది ఉమ్మడి కుటుంబం. తన తండ్రి తర్వాత కుటుంబ బాధ్యత అంతా తన పైన వేసుకున్నారు.
Advertisement
also read;చలపతిరావు జీవితంపై ఓ సినిమా కూడా వచ్చిందని మీకు తెలుసా..?
Advertisement
అలాంటి సాయి కుమార్ కు తన భార్య సురేఖ ఎప్పుడు అండదండగా ఉంటూ వచ్చేదట. సాయికుమార్ కు అండగా ఉండటమే కాకుండా తన కుటుంబాన్ని మొత్తం కంటికి రెప్పలా చూసుకునేదట సురేఖ. సాయికుమార్ సంపాదించిన ప్రతి పైసా ను ఆమె చేతుల్లోనే పెట్టేవారట. ఇంట్లో ఖర్చులకు పోగా మిగిలిన డబ్బు అంతా సేవ్ చేసేదని ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశారు. అంతేకాకుండా సాయికుమార్ తమ్ముళ్ల జీవితాలు సెట్ చేయడంలో కూడా సురేఖ కీలక పాత్ర, వారికి కావలసిన ఖర్చులు పెళ్లిళ్ల విషయంలో కూడా సురేఖ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వారిని సమాచారం. వారి కుటుంబంలో సురేఖని దేవతగా భావిస్తారట.
తన భర్త ఎంత సంపాదిస్తున్నా కానీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, కుటుంబంలో అందరిని సెట్ చేయడంలో కీలక పాత్ర పోషించిందట. అంతేకాకుండా తన కుమారుడు ఆదికి తన సొంత తమ్ముడి కూతురుతో వివాహం జరిపించిందట. ఈ విధంగా తల్లి గారి కుటుంబాన్ని, అత్తగారి కుటుంబాన్ని సమన్వయం చేసుకుంటూ జీవితంలో ఎదగడం కోసం సురేఖ ముందుకు సాగిందని తెలుస్తోంది. అప్పుల బాధతో సతమతమవుతున్న వారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని భావించిన సమయంలో దాసరి గారితో ఆగిపోయిన వారి సినిమాను విడుదల చేయించిందట సురేఖ.
A lso read;కేజిఎఫ్ మూవీతో కైకాల కుమారుడికి ఎన్ని లాభాలు వచ్చాయంటే..?