Home » హీరో అయ్యేందుకు నిఖిల్ అంత‌కష్ట‌ప‌డ్డాడా..? డ‌బ్బులు ఇచ్చినా చివ‌రికి..!

హీరో అయ్యేందుకు నిఖిల్ అంత‌కష్ట‌ప‌డ్డాడా..? డ‌బ్బులు ఇచ్చినా చివ‌రికి..!

by AJAY
Ad

హ్యాపిడేస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ నిఖిల్ హిట్ ట్రాక్ పై ప్ర‌యాణం చేస్తున్నాడు. రీసెంట్ నిఖిల్ కార్తికేయ 2 తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వ‌చ్చింది. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వ‌చ్చింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత 18 పేజిస్ అనే సినిమాతో ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

NIKHIL

NIKHIL

అనుప‌మ ప‌ర‌వేశ్వ‌ర‌ణ్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది. రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. తాను హీరో అయ్యిందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ను ప్రారంభించిన తాను ఓ సీరియ‌ల్ లో చిన్న పాత్ర‌లో న‌టించాన‌ని చెప్పాడు.

Advertisement

Advertisement

అక్క‌డే ఉంటే బుల్లితెర‌కే ప‌రిమితం అవుతాన‌ని సినిమాల‌కు ఆడిష‌న్స్ ఇచ్చిన‌ట్టు తెలిపాడు. ఈ క్ర‌మంలో కొంత‌మంది ద‌ర్శకులు యాక్టింగ్ ను మెచ్చుకుని అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పి ఆ త‌ర‌వాత ప‌ట్టించుకోలేద‌ని చెప్పాడు. అంతే కాకుండా కొంద‌రు నిన్ను హీరోను చేయాలంటే యాబై ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని అనేవార‌ని చెప్పాడు.

యాభై ల‌క్ష‌లు కోటి తీసుకువ‌స్తే హీరోను చేస్తామ‌ని చెప్పేవార‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఓ ద‌ర్శ‌కుడు త‌న వ‌ద్ద రూ.5ల‌క్ష‌లు తీసుకున్నాడ‌ని ఆ త‌ర‌వాత ల‌క్ష ఖ‌ర్చు అయ్యేవర‌కు షూటింగ్ చేసి ఆ త‌ర‌వాత ఆపేశార‌ని చెప్పాడు.

Visitors Are Also Reading