Home » నిద్ర లేవగానే తల తిరుగుతోందా..అయితే ఈ వ్యాధులు ఉన్నట్టే..?

నిద్ర లేవగానే తల తిరుగుతోందా..అయితే ఈ వ్యాధులు ఉన్నట్టే..?

by Sravanthi
Published: Last Updated on
Ad

చాలామందికి ఉదయం పూట నిద్ర లేవగానే తల తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ కారణం వల్ల చాలామంది అలా పడుకోనే ఉంటుంటారు. తిప్పడం కాస్త తగ్గితేనే బెడ్ నుంచి లేస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దని, దీన్ని సాధారణ సమస్యగా భావిస్తే చాలా నష్టం వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తరచూ తల తిప్పడం అనేది వస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలని వారు అంటున్నారు.మీ బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోయినా తల తిరుగుతుంది. లోబీపీ రావడానికి ఇవి కారణాలు కావచ్చు.

Advertisement

దీనివల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గడం, డిహైడ్రేషన్ గుండెలో రక్తంగడ్డ కట్టడం, అండ్రినలైన్ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుందట. ఇవి రావడానికి ప్రధాన కారణం హై బీపీ ఉన్నవారు సరిగా మందులు వేసుకోపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగటం, తీసుకోవడం వల్ల వస్తుందట. అంతేకాకుండా కండరాలు బలహీనపడినా, గుండె సమస్యలు ఉన్నా కానీ పొద్దున్నే తల తిప్పుతుందట.. దీనివల్ల కండరాలు బలహీనంగా మారి, బ్లడ్ అనేది తక్కువగా పంపిణి చేయబడుతుంది.

Advertisement

ఇలాంటి లక్షణాలు మీలో ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిదని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా డిహైడ్రేషన్ కారణంగా కూడా నిద్రలేచిన వెంటనే తల తిరుగుతుందట. దీనికి ప్రధాన కారణం తగినంత నీరు తాగకపోవడం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి పొద్దున నిద్ర లేవగానే తలతిప్పినట్టు అనిపిస్తే దాన్ని సాధారణ సమస్యగా తీసుకోకుండా డాక్టర్ ను సంప్రదించి తగిన పరిష్కారం తీసుకోవాలని నిపుణులు అంటున్నారు ..

also read:చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో గోడకు వేలాడదీశారా..? అయితే మీకు ఆ సమస్యలు తప్పవు..!

Visitors Are Also Reading