మన పూర్వకాలం నుంచి పెద్దలు కొన్ని సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నారు. వాటిని మనం కూడా ఫాలో అవుతూ ఉన్నాం. మరి ఆ సాంప్రదాయాలు ఎలా వచ్చాయి అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. సాధారణంగా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు 116,216,516,1116 లాంటివి కట్న కానుకగా చదివిస్తాం. ఇక చివరిలో 16 రూపాయలు చదివిస్తూ ఉంటారు. 100,500, 1000 వెనకాల 16 రూపాయలు ఎందుకు యాడ్ చేస్తారు అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న.
Advertisement
Also read;Inter exams schedule: ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
కేవలం ఫంక్షన్లోనే కాదు గుడిలోకి వెళ్లినా కానీ ఈ 16 రూపాయలనేవి చదివిస్తూ ఉంటారు. మరి 16 రూ.వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సాధారణంగా 100. రూపాయలు ఇవ్వడమే సాంప్రదాయంగా ఉండేది. కానీ నిజాం పాలనలో వేరే రాజ్యాంగం అమలులో ఉండేది. ఆ సమయంలో నాణేలు అందుబాటులో ఉండేవి. అక్కడ రూపాయి ఆంధ్ర మరియు తదితర ప్రాంతాల విలువను బట్టి చూసినప్పుడు 100 రూపాయలు ఇస్తే అది 90 రూపాయలు మాత్రమే అయ్యేదట.
Advertisement
అందుకే నిజాం రాజ్యంలోని గద్వాల వంటి సంస్థానం వాళ్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు పండితులకు ఇక్కడి వందకు సరిపోయే విధంగా అంటే పండితులకు తక్కువ అనే భావన రాకుండా 16 రూపాయలు కలిపి ఇచ్చేవారు. అంటే ఇక్కడి 116 రూపాయలు అక్కడి ప్రాంతంలో వంద రూపాయలతో సమానం. ఇది కాస్త ఆచారంగా మారింది. గుడిలోకి కానీ,ఫంక్షన్లోకి కానీ వెళ్ళినప్పుడు మనం వేసే కట్న కానుకల డబ్బుకు 16 రూపాయలు తప్పనిసరిగా కలిపి ఇస్తూ ఉంటాం. ఒకవేళ మన దగ్గర చిల్లర లేకుంటే పక్కవారిని అప్పు అడిగి మరీ ఇస్తుంటాం. ఆ విధంగా వచ్చిన ఆచారమే ఈ 116 రూ.ల పద్ధతి ..
A lso read;అవసరాల శ్రీనివాస్ పనే బాగుంది.. డైలాగ్ రైటర్ గా చేసే ఇంత సంపాదించాడా..?