గేయ రచయిత సిరివెన్నెల.. గురించే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన మరణం తర్వాత ఒక్కసారిగా ఎన్నో సంఘటనలు, వార్తలు, జ్ఞాపకాలు వైరల్ అవుతున్నాయి. సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడు వేలకు పైగా అద్భుతమైన పాటలను సినిమా రంగానికి అందించారు.
చివరి క్షణం వరకు ఆయన పాటలు రాశారు. ఈయన పాట లేనిదే రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా ఎందరో దర్శకులు సినిమాలు తీయలేదుఅంటే అతిశయోక్తి కాదు. ఇక విశ్వనాధ్ ఇదే సిరివెన్నెల లోని సాహిత్య పటిమను పూర్తిగా వినియోగించుకున్నారు.
Advertisement
Advertisement
అయితే డబ్బు కోసం కాకుండా సన్నివేశం పాటలు రాసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయట. రమ్య నరేషన్ డిమాండ్ చేయకుండా ఎంతిస్తే అంతే తీసుకొని చక్కని పాటలు అందించిన సిరివెన్నెల జ్ఞాపకాలు ఇంకా అందరినీ వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు మూడున్నర దశాబ్దాల సినిమా ప్రయాణంలో లో దాదాపు 8 వందల సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాయడమే కాదు,ఇంకా ఆయన రాసిన సినిమా పాటలు తాలూకా సినిమాలు విడుదల కావలసి ఉంది అందులో ఆర్.ఆర్ఆర్,శ్యామ్ సింగరాయి వంటి మూవీస్ ఉన్నాయి.