టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి, ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సంచలన సినిమాలు, నవ్వించే పాత్రలు, గుర్తుండిపోయే కథలు. గత 30 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీతో విడదీయలేని సంబంధం ఆయన పెన వేసుకున్నారు. ఈయన పేరు చెబితే కొందరికి ఆపరేషన్ దుర్యోధన లాంటి ఎమోషన్ సినిమా గుర్తుకొస్తుంది. మరికొందరికి ఈయన కలం నుంచి జాలువారిన పవిత్ర బంధం, సీతయ్య లాంటి సినిమాలు వెంటనే మదిలోకి వస్తాయి.
READ ALSO : వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!
Advertisement
ఇంకొందరికి కామెడీ గుర్తుకొస్తుంది. ఇది ఇలా ఉంచితే, కొంతమంది ఎప్పుడు మాటల మధ్యలో ఒకే పదాన్ని వాడి దానిని ఊతపదంగా మార్చేస్తారు. మన పోసాని కృష్ణ మురళికి కూడా ఇలా చాలా రకాల అలవాట్లు ఉంటాయి. తరచుగా ఆయన వేసుకున్న డ్రెస్ ని సరి చేసుకుంటూ ఉన్నట్లుగా కనిపిస్తారు. ఏం మాట్లాడినా మధ్యలో రాజా అని, ఐ లవ్ యు రాజా అని అంటూ ఉంటారు. అయితే ఆయనకి ఊతపదం ఎలా అలవాటు అయిందంటే, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనకి ఐ లవ్ యు రాజా అనే ఊతపదం ఎలా అలవాటు అయ్యిందో చెప్పుకోచ్చారు పోసాని.
Advertisement
“ఓ పిల్లల టాలెంట్ షో కి నేను జడ్జిని. అక్కడికి వచ్చి తమ ప్రతిభను ప్రదర్శించిన పిల్లలకు ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా వారిని నొప్పించకుండా మాట్లాడడం కోసం మరోసారి ఇంకా బాగా చెయ్యి నాన్న అని చెబుతూ, “ఐ లవ్ యు రాజా” అనేవాన్ని. అది బాగా పాపులర్ అయింది. దాంతో పిల్లలు కూడా నన్ను లవ్ యూ రాజా అనసాగారు. అది తెలుగు నాట అంతటా పాపులర్ అయింది. ఆ తర్వాత ఈ డైలాగునీ సినిమాలో కూడా పెట్టాను. అక్కడ కూడా బ్రహ్మాండంగా ఆ డైలాగు పేలింది. అప్పటి నుంచి ఐ లవ్ యు రాజా అనే మాట దేశమంతటా అందరూ వాడుతున్నారు” అని చెప్పారు పోసాని.
READ ALSO : FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్ కప్-2022 ఛాంపియన్ గా అర్జెంటీనా..ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా ?