Home » బంగ్లా పై టీమిండియా గ్రాండ్ విక్టరీ..188 పరుగుల తేడాతో విజయం

బంగ్లా పై టీమిండియా గ్రాండ్ విక్టరీ..188 పరుగుల తేడాతో విజయం

by Bunty
Ad

మొదటి టెస్ట్ లో బంగ్లా ను చిత్తు చేసింది టీమిండియా. బంగ్లా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా, తొలి టెస్ట్ లో శుభారంభం చేసింది. చిట్టాగాంగ్ టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా 1-0 ఆదిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కు 513 పరుగుల లక్ష్యం విధించగా, ఆ జట్టు 324 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

read also : వైరల్ అవుతున్న ‘బాల రామాయణం’ నటుల ఫోటోలు..!

Advertisement

తొలి ఇన్నింగ్స్ లో ఐదు, సెకండ్ ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ భారత్, మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పూజారా (90), శ్రేయస్ అయ్యర్ (86), రవిచంద్రన్ అశ్విన్ (58), రిషబ్ పంత్ (46), కుల్దీప్ యాదవ్ (40) పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

Advertisement

తైజుల్ ఇస్లామ్, మెహిదీ హాసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ను భారత బౌలర్లు ఆటాడుకున్నారు. వచ్చిన బ్యాట్స్ మెన్ ను వచ్చినట్లు పంపించారు. దీంతో 150 పరుగులకే ఆతిథ్య జట్టు కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో చెలరేగగా, మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసి బంగ్లా పతనంలో కీలక పాత్ర పోషించారు. దీంతో భారత్ కు 254 పరుగుల ఆదిక్యం లభించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, ధీటుగానే జవాబిచ్చింది. కాగా ఈ నెల 22 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.

ఇవి కూడా చదవండి : త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న శార్దూల్ ఠాకూర్.. పెళ్లి కూతురు ఎవరంటే ?

Visitors Are Also Reading