2022లో చాలామంది సెలబ్రిటీలు, తమ బ్యాచలర్ లైఫ్ కు చెక్ పెట్టారు. నచ్చిన వాడితో ఏడడుగులు నడిచి వివాహ బంధానికి వెల్కమ్ చెప్పారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అయితే తాజాగా మరో స్టార్ పెళ్లి చేసుకోబోతున్నాడు. భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన శార్దూల్ ఠాకూర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు.
READ ALSO : Avatar-2 Review in Telugu : ‘అవతార్ 2’ రివ్యూ
Advertisement
వచ్చే ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్ ను వివాహం చేసుకోనున్నారు. నిజానికి వీరిద్దరూ గత కొన్నేలుగా ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో గత నవంబర్ లో వీరికి నిశ్చితార్థం జరిగింది. తాజాగా వివాహ ముహూర్త తేదీని ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు శార్దూల్ ఠాకూర్ క్రికెట్ సిరీస్ లలో బిజీగా గడపనున్నారు. దీంతో 27వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు.
Advertisement
అయితే వివాహ వేడుకలు మాత్రం 25వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ముంబై శివారులోని కర్జత్ లో మహారాష్ట్ర సాంప్రదాయ పద్ధతిలో ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరుగుతుంది. మోడల్ అయినా మిథాలీ ప్రస్తుతం బేకింగ్ స్టార్టప్ ను నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఏడాది ఐపిఎల్ లో శార్దూల్ కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడిని కోల్కత్తా కొనుగోలు చేసింది. పోయిన ఏడాది వేలంలో రూ. 10.75 కోట్లకు శార్దూల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ట్రేడింగ్ పద్ధతిలో కోల్కత్తాకు అమ్మేసింది.
read also : వైరల్ అవుతున్న ‘బాల రామాయణం’ నటుల ఫోటోలు..!