దీపికా పదుకునే హీరోయిన్ గా షారుక్ ఖాన్ హీరోగా నటించిన సినిమా పటాన్. ఈ సినిమా నుండి రీసెంట్ గా ఓ పాట విడుదల చేశారు. కాగా ఆ పాటలో దీపికా పదుకునే వేసుకున్న డ్రెస్సు పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అంతే కాకుండా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమాలో దీపికా ఆ డ్రెస్సులో ఉన్న సీన్లను తొలగించకపోతే తమ రాష్ట్రంలో సినిమాను నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాకుండా నెటిజన్ లు సోషల్ మీడియాలో బైకాట్ పఠాన్ అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.
Advertisement
ఇక కొంతమంది అయితే షారుక్ ఖాన్ దిష్ఠి బొమ్మ ను దహనం చేశారు. ప్రస్తుతం దీపికా డ్రెస్సు వివాదం మరింత ముదురుతోంది. అయితే నటుడు ప్రకాష్ రాజ్ బీజేపీ విధానాలను విమర్శిస్తూ ఫైర్ అవుతూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రకాష్ రాజ్ పఠాన్ సాంగ్ వివాదం పై తనదైన స్టైల్ లో స్పందించాడు. బేషరం బిగోట్స్ కాషాయం దరించి రేపిస్టులను సత్కరిస్తే వాళ్లను సపోర్ట్ చేస్తే ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే పర్వాలేదు.
Advertisement
బ్రోకర్ ఎమ్మెల్యేలు మరియు కాషాయ స్వామీజీలు మైనర్ లపై దారుణాలు చేస్తే ఎవ్వరికీ పట్టదు కానీ ఓ సినిమా సాంగ్ లో బోల్డ్ డ్రెస్ ధరించకూడదా జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ట్విట్ కు కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ప్రకాష్ రాజ్ పైన ఫైర్ అవుతున్నారు.
ప్రకాష్ రాజ్ బీజేపీ వ్యతిరేఖి అని అందుకే ఆ పాటకు సపోర్ట్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఆక మరి కొంతమంది కరెక్ట్ గా చెప్పారు…బీజేపీ వాళ్లకు అభివృద్ది చేయడం చాతకాదు కానీ ఇలాంటివి పట్టుకుని లేనిపోని వివాదాలు పెట్టడం మాత్రం వచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.