Home » అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి !

అప్పుగా ఇచ్చిన డబ్బు త్వరగా వసూలు కావాలంటే.. ఈ చిట్కాలు పాటించండి !

by Bunty
Ad

ప్రస్తుత కాలంలో విపరీతంగా ఖర్చులు పెరిగి పోయాయి. దీంతో చాలా మంది అప్పులు చేస్తూ ఉంటారు. అయితే, సర్వ సాధారణంగా సరైన ఆర్థిక విధానాలు పాటించని వ్యక్తులే ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వస్తుంటుంది. అయితే, అప్పుచేయడం మినహా మరో మార్గం లేదన్నప్పుడు బ్యాంకులో రుణం తీసుకోవడం శ్రేయస్కరం. బ్యాంకులో రుణగ్రహీత ఆదాయ వ్యయాలు పరిశీలించి, సిబిల్ స్కోర్ ను అనుసరించి ఋణ పరిమితిని నిర్ణయిస్తారు.

READ ALSO : కిడ్నీకి రూ.7 కోట్లు ఆఫర్‌ చేసిన మోసగాళ్లు.. రూ.16 లక్షలు పొగొట్టుకున్న విద్యార్థిని

Advertisement

అయితే, కొంతమంది మాత్రం స్నేహితులకు, బంధువులకు డబ్బులు అప్పుగా ఇస్తారు. కానీ అప్పు తీసుకున్న వారు మాత్రం తిరిగి ఇవ్వరు. ఇవ్వకపోగా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. అయితే ఇచ్చిన అప్పులు తిరిగి రావాలంటే ఈ నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ చక్రానికి ఖడ్గమాల చదువులు బిల్వ దళాలతో పూజ చేయాలి. లేదా లలిత సహస్రనామ పారాయణ చేయాలి. లేదంటే పంచాయుధ స్తోత్రం రోజు 27 సార్లు 41 రోజుల పాటు పారాయణ చేసిన ఫలితం ఉంటుంది.

Advertisement

ఇచ్చిన అప్పు తిరిగి త్వరగా వసూలు కావాలంటే, దీపంలో రెండు గురివింద గింజలు వేసి కొబ్బరి నూనెతో దీపం పెట్టి లక్ష్మీ స్తోత్రం పారాయణ చేస్తూ వాడని పువ్వులు అంటే, వెండి పువ్వులతో ఒక్కో శ్లోకానికి ఒక్కో పువ్వుని సమర్పిస్తూ పూజ చేసి చివరగా కనకధార స్తోత్రం ఖడ్గమాల పారాయణ చేసినా ఫలితం ఉంటుంది. ప్రతి మంగళవారం ఇంటి దేవుడికి పులిహోర నివేదన చేసి అది పంచిపెట్టాలి. దీంతో నష్టపోయిన మరియు అప్పుగా ఇచ్చిన డబ్బు అన్ని వెనక్కివస్తాయి. అలాగే కేసులు శత్రువుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఇక శత్రువుల భయం పోవాలంటే భైరవుడి స్తోత్రం ప్రత్యంగిర స్తోత్రాలను రాత్రి 8 గంటల తర్వాత పారాయణ చేయాలి. అలాగే ఈ పారాయణాలను 41 రోజుల పాటు చేస్తే, ఎలాంటి మొండి అప్పు అయినా సరే వెంటనే వెనక్కివస్తుంది.

READ ALSO : పవన్ కళ్యాణ్ “వారాహి” రిజిస్ట్రేషన్ ఖర్చు ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading