సాధారణంగా అంతర్జాతీయ ఆటలు ఆడే ప్లేయర్స్ ఆహార విషయం లో కఠిన నిర్ణయాలు పాటిస్తారు. తమ ఫిట్ నెస్ కాపాడుకోవడానికి ప్రత్యేకంగా డైటిషన్ ను కూడా నియమించుకుంటారు. ఆటగాళ్లకు కావాల్సిన వాటిల లో ముఖ్య మైంది ఫిట్ నెస్. కాబట్టి ఆ ఫిట్ నెస్ ను కాపాడు కోవడానికి ఆటగాళ్లు నిరంతరం కష్ట పడుతారు. వారి శక్తి ని కాపాడుకోవడానికి నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ లు ఆడే సమయంలో ప్లేయర్స్ ఎలాంటి ఆహారం తీసుకుంటారని చాలా మంది కి డౌట్ వస్తుంది.
Advertisement
అన్ని గేమ్ ల కంటే క్రికెట్ లో టెస్ట్ మ్యాచ్ లో ఒక రోజు మొత్తం ఫిట్ గా ఉంటు అలసి పోకుండా ఉండాలి. దాని కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. అలాంటి సందర్భాలలో ఆటగాళ్లు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణం గా టెస్ట్ క్రికెట్ లో మొత్తం మూడు సెషన్స్ ఉంటాయి. అందులో రెండు ఆహారం తీసుకోవడానికి రెండు సార్లు విరామం ఇస్తారు. ఒక సారి బ్రెక్ ఫాస్ట్ అని మరో సారి లంచ్ బ్రెక్ అని రెండు సార్లు విరామం ఇస్తారు.
Advertisement
అయితే ఈ బ్రెక్ లలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటారో చూద్దం. టెస్ట్ మ్యాచ్ లో ముందుగా మొదటి సేషన్ ప్రారంభం అయ్యే ముందు ఆటగాళ్లు బ్రెక్ ఫాస్ట్ చేస్తారు. ఈ సమయం లో ఆటగాళ్లు పాలు, గుడ్లు, బ్రెడ్, పాస్తా తో పాటు మరికొన్ని లైట్ ఫుడ్ ను తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చే లంచ్ బ్రెక్ లో చికెన్, పన్నీర్, ఫిష్ తో పాటు మరికొన్ని బలమైన ఆహారాన్ని తీసుకుంటారు. అయితే టెస్ట్ క్రికెట్ కాబట్టి తమ ఆట సమయాన్ని బట్టి కూడా ఆహారం మోతాదు ఉంటుంది.
ఒకవేళ త్వరగానే వారు ఆడే సమయం వస్తే ఒక రకమైన ఆహారం ఉంటుంది. అలాగే వారు ఆడటానికి ఎక్కువ సమయం ఉంటే మరోక రకం ఆహారం తీసుకుంటారు. ఇలా సందర్భాన్ని బట్టి ఆహారాన్ని తీసుకుంటారు. అయితే టెస్ట్ మ్యాచ్ లు ఉన్న సమయం లో మాత్రం హేవీ ఫుడ్ కు మాత్రం ఆటగాళ్లు దూరం ఉంటారు.