Home » భార్యాభర్తల బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ 3 సూత్రాలు పాటించండి…! 2వది ఇంపార్టెంట్..!

భార్యాభర్తల బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఈ 3 సూత్రాలు పాటించండి…! 2వది ఇంపార్టెంట్..!

by AJAY
Ad

ఈ కాలంలో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. కొన్నిసార్లు చిన్న విషయాలే అని వదిలేస్తే అవి పెద్ద సమస్యగా మారుతాయి. ఆ తర్వాత విడాకులకు దారితీస్తాయి. కాబ‌ట్టి రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు కొన్ని సూత్రాలు పాటిస్తే భార్యాభర్తల అనుబంధం సాఫీగా సాగుతుంది అని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. పెళ్ళికి ముందు భార్య భర్తలు ఎవరో ఒకరికి పాస్ట్ స్టోరీలు ఉంటాయి.

Advertisement

అయితే వాటిని మర్చిపోవాలి… పెళ్లి తర్వాత కూడా వాటినే నెమ‌రు వేసుకుంటూ, మాజీ ప్రియుడు లేదా ప్రేయసి తో సంబంధాన్ని కొనసాగిస్తే ఆ ప్రభావం భార్యాభర్తల మధ్య తుఫానుగా మారి విడాకులకు దారితీస్తుంది. అంతే కాకుండా భార్య లేదా భర్తలో కొన్ని గుణాలు లక్షణాలు మరొకరికి నచ్చకపోవచ్చు. అయితే ఆ లక్షణాలను గుణాలను తమ భాగస్వామి కోసం మార్చుకోవాలి. లేదంటే ఆ బంధంలో గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది.

Advertisement

తనకోసం నేనెందుకు మారాలి అని మొండి పట్టుదల ఉండకుండా ఒకరికోసం మరొకరు మారితేనే ఇద్దరి మధ్య సంబంధాలు చ‌క్క‌గా ఉంటాయట‌. భార్యాభర్తల మధ్య పారదర్శకత ముఖ్యం అని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. పారదర్శకత ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు రావు…. భర్తకు తెలియకుండా భార్య నచ్చని పనులు చేయడం… భార్య‌కు తెలియ‌కుండా భర్త నచ్చన పనులు చేయడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది.

అంతే కాకుండా తమ జీవిత భాగస్వామిని క్షమించే గుణం ఉండాలని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. సంసారంలో తప్పులు చేయడం సహజం…. అయితే ఆ తప్పును ప్రతిసారి ఎత్తి చూపకుండా క్షమించినప్పుడు ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయని లేదంటే గొడవలు పెరిగి విడాకులకు దారితీసే అవకాశాలు ఉన్నాయ‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

Visitors Are Also Reading