మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఇల్లు కట్టేటప్పుడు ప్రతిదీ వాస్తు ప్రకారం గా నిర్మించాలని అనుకుంటారు. అందువల్లే వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు అంటే ఇళ్ల నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో అమర్చే వస్తువులు ఇతర విషయాల్లోనూ వాస్తుని నమ్ముతుంటారు. ఒకవేళ వాస్తు సరిగా లేనట్లయితే ఆ ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయని విశ్వసిస్తూ ఉంటారు.
అయితే కేవలం ఇంటి నిర్మాణం మరియు వస్తువుల అమరికలోనే కాకుండా మొక్కల పెంపకంలోనూ వాస్తు పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే మంచి జరిగితే మరికొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకుంటే చెడు ప్రభావాలు వస్తాయని చెబుతున్నారు. సాధారణంగా తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచి జరుగుతుందని భావిస్తారు.
Advertisement
Advertisement
ప్రతి ఇంట్లో తులసిని పెంచుకుంటారు. అదేవిధంగా ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే డబ్బులు వస్తాయని నమ్ముతారు. అయితే కొన్ని మొక్కలను మాత్రం ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం………. ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
నిమ్మచెట్టు సైతం ఇంట్లో పెంచుకోకూడదని చెబుతున్నారు. అంతే కాకుండా కలబంద, బ్రహ్మజముడు నాగజముడు లాంటి మొక్కలు ఇంట్లో పెంచుకోకూడని చెబుతున్నారు. నిమ్మ చెట్లు ఇంట్లో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా రాగి చెట్టును కూడా ఇంటిలో పెంచుకోకూడదని చెబుతున్నారు. వీటితో పాటు ఇండ్లలో మిరప మొక్కలను సైతం పెంచుకోవద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.