హిందూ పురాణాలలో వాస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఆలయాల నిర్మాణాలు జరిగేవి. ప్రతివిషయంలోనూ వాస్తును పాటించేవారు. మన పూర్వీకులు వాస్తు ఆధారంగానే ఇంటిని నిర్మించుకునేవాళ్లు. అప్పటి నుండి అనాదిగా మనవాళ్లు వాస్తును పాటిస్తున్నారు. వాస్తు సరిగా లేనట్లయితే చాలా సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు బాగుంటేనే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
Advertisement
ఆరోగ్యం, ఉద్యోగం, మనశాంతి ఇలా ప్రతి విషయం పై వాస్తు ఆధారపడి ఉంటుంది. కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల అమరికలోనూ వాస్తును పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా బెడ్ రూమ్ లో కొన్ని వస్తువులు ఉంటే భార్య భర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ వస్తువులు ఏవో ఇప్పుడు చూద్దాం…పడకగది ప్రశాంతంగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అంతే కాకుండా పడకగదిలో చెత్త అసలు ఉంచకూడదని చెబుతున్నారు. పడకగది శుభ్రంగా లేనట్టయితే భార్య భర్తల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా బెడ్ రూమ్ లో నల్లటి వస్తువులను ఉంచకూడని చెబుతున్నారు. నల్లటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదని చెబుతున్నారు.
బెడ్ రూమ్ లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టీవీ…కంప్యూటర్ లాంటివి కూడా పెట్టుకోకూడదని వాటి వల్ల గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పడకగదిలో మొక్కలను పూవులను పెట్టుకోవడం మంచిదని అయితే వాడిపోయిన మొక్కలను మరియు వాడిపోయిన పూవులను మాత్రం పెట్టుకోకూడని హెచ్చరిస్తున్నారు.