ఇంట్లో దరిద్రం ఉంటే ఏ పనిచేసినా ఫలితం ఉండదు. మనం ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుంది. అయితే మనం అనుకున్న పనులు జరగాలన్నా అనుకున్నది సాధించి ప్రశాంతంగా ఉండాలన్నా ముందుగా ఇంట్లో నుండి దరిద్ర దేవతను పంపించాలి. అయితే ఆ దరిద్ర దేవత ఎవరో కాదు. లక్ష్మీ దేవికి ఒక అక్క ఉంది. ఆమెక పేరే జేష్టా దేవి కాగా దరిద్ర దేవత అనికూడా పిలుస్తారు. దరిద్ర దేవత ఎలాంటి ప్రదేశాల్లో ఉంటుందో ఎలాంటి ప్రదేశాల్లో ఉండదో తానే స్వయంగా చెప్పింది.
Advertisement
దరిద్ర దేవత ఉదాలక మహర్షిని పెళ్లి చేసుకుని ఆశ్రమానికి వచ్చినప్పుడు ఇంట్లోకి రమ్మని ఆయన ఆహ్వానిస్తాడు. దాంతో తాను యగ్జయాగాలు జరిగిన చోటుకు రాలేనని దరిద్ర దేవత అతడితో చెప్పింది. అంతే కాకుండా ఎక్కడైతే తల్లిదండ్రులను గురువులను పూజిస్తారో…లక్ష్మీ దేవికి పూజలు చేస్తారో ఆ ఇంట్లోకి తాను రాలేనని చెప్పింది. ఏ ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉంటారో ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా దరిద్ర దేవత ఉంటుందని తెలిపింది.
Advertisement
ఏ ఇంట్లో నుండి దుర్వాసన వస్తుందో ఆ ఇంట్లో కూడా దరిద్ర దేవత ఉంటుందని తెలిపింది. అదే విధంగా కొందరి ఇంట్లో అంతా నీరసంగా ఉంటారు అలాంటి ఇంట్లో కూడా దరిద్ర దేవత ఉంటుందని తెలిపింది. దరిద్రదేవత ఇంట్లోకి రాకుండా ఇంటి ముందు భాగంలో మిరపకాయలు నిమ్మకాయలు కలిపి కట్టాలి. ప్రతి రోజు ఇంట్లో తుడిచేటప్పుడు పసుపు కర్పూరం వేసి తుడవాలి.
ప్రతి మంగళవారం సామ్రాణి గుగ్గిలం, నెయ్యిలతో దూపం వేయాలి. ఓ రాగి చెంబులో నీరు పోసి అందులో పసుపు వేసి ఇళ్లంతా ఆ నీళ్లను చల్లాలి. ప్రతి రోజూ పూజా మందిరంలో దీపం పెట్టాలి. అదే విధంగా ఇంటికి ఉన్న రెండు గడపలకు పసుపు రాసి ఆ బొట్టును ఇళ్లాలు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లోనుండి దరిద్ర దేవత వెళ్లిపోతుంది.