సాధారణం గా బ్రహ్మణులు మాంసం మాత్రమే తినరు అనుకుంటాం. కానీ బ్రహ్మణులు మాంసం తో పాటు చాలా ఆహార పదర్థాలను ముట్టుకోరు. కొన్ని ఆహార పదర్థాలు నిత్యం వాడకం లో ఉన్నా.. బ్రహ్మణులు మాత్రం ఆ యా ఆహార పదర్థాలను అసలు ముట్టుకోరు. నిజానికి బ్రహ్మణుల కుటుంబాలలో ఆహార నియమాలు, పద్దతులు చాలా నిష్ట గా ఉంటాయి. అందులో భాగం గా వారు తినే ఆహార పదర్థాల పై కఠిన మైన నియమాలు పెడుతూ ఉంటారు. అయితే బ్రహ్మణులు ఏయే ఆహార పదర్థాలను ముట్టుకోరు.. దానికి గల కారణం ఎంటో మనం ఎప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
బ్రహ్మణులు తినని ఆహార పదర్థాలలో ముఖ్య మైంది ఉల్లిగడ్డ. బ్రహ్మణులు ఉల్లిగడ తో పాటు వెల్లులిని కూడా ముట్టుకోరు. నిజానికి ఉల్లిగడ్డ గానీ, వెల్లులి గానీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. అయినా.. బ్రహ్మణులు ఆయా పదర్థాలను ముట్టుకోరు. ఉల్లిగడ్డలు, వెల్లులి ని కూరలలో కూడా వేయడానికి బ్రహ్మణులు ఇష్ట పడరు. దీనికి వారి పరంగా బలమైన కారణాలే ఉన్నాయి. ఈ ఉల్లిపాయలు, వెల్లులి లో సల్ఫర్ ఎక్కువ గా ఉంటుంది. దీంతో ఉల్లి పాయలు, వెల్లులి ఎక్కువ గా తినడం వల్ల నోటి నుంచి ఒక రకమైన వాసన వస్తుంది.
ముఖ్యం గా ఉల్లి పాయ, వెల్లులి తిన్న సమయాల్లో మాట్లాడినప్పుడు ఎక్కువ గా వాసన వస్తుంది. అయితే బ్రహ్మణులు ఎక్కువ గా మంత్రోచ్ఛారణ చేస్తు ఎక్కువ గా మాట్లాడుతూ ఉంటారు. ఈ సమయం లో ఎక్కువ గా వాసన వస్తే ఇతర ఇబ్బందులు ఎదురు అవుతాయని కొంత మంది భావిస్తారు. అలాగే మరి కొందరు తమో, రజో గుణాలు ఉన్న ఆహార పదర్థాలను ముట్టుకోరు. వాటికి చాలా దూరం గా ఉంటారు. అందుకే ఉల్లి పాయలను, వెల్లుల్లిని తినటానికి ఇష్ట పడరు.