మన దేశంలో క్రికెట్ కు మంచి ఆధరణ ఉంటుంది. క్రికెట్ మన దేశంలో పుట్టక పోయినా.. క్రికెట్ కు కోట్ల సంఖ్య లో అభిమానులు ఉన్నారు. అలాగే మన దేశంలో క్రికెట్ ఆడేవారు చాలా మంది ఉన్నారు. భారత జట్టు లో చోటు కోసం చాలా మంది ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. కాంపిటీషన్ ఎక్కువ గానే ఉంది. అయితే భారత జట్టు లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు ప్రభుత్వ ఉద్యోగాలను చేసిన వారు ఉన్నారు.
Advertisement
కొంత మంది ఆటగాళ్లు క్రికెట్ కు రాక ముందు ఉద్యగం చేస్తే మరి కొందరు.. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అలా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న 5 గురు క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం.
1) ముందు గా క్రికెట్ కు దేవుడు గా పిలుచుకునే సచిన టెండూల్కర్ గురించి చూద్ధం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకం గా ఎవరీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల పాటు భారత క్రికెట్ కు సేవలు అందించాడు. ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. అయితే సచిన్ టెండూల్కర్ కు 2010 సంవత్సరం లో భారత ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ గా నియమించింది.
2) భారత క్రికెట్ ఎంతో మంది అభిమనులను దక్కించు కున్న మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలుసుకుందాం. తన కెప్టెన్సీ తో భారత్ కు అనేక ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ధోని కి మాత్రమే దక్కుతుంది. కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తం కోట్ల సంఖ్య లో అభిమానులను ధోని సొంతం చేసుకున్నాడు. అయితే ధోని క్రికెట్ లోకి రాక ముందే.. ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశాడు. అనంతరం ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ ద్వారా లెఫ్టినెంట్ కల్నెల్ గా ధోని ని నియమించారు.
Advertisement
3) మరోకరు జోగిందర్ శర్మ. జోగిందర్ శర్మ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండుదు. ఎందుకంటే.. 2007 లో జరిగిన టీ 20 ప్రపంచ కప్ లో దాయాది దేశం అయిన పాక్ ను ఓడించిన బౌలర్ జోగిందర్ శర్మ. ఈ జోగిందర్ శర్మ కు అప్పుడు హర్యానా రాష్ట్రంలో పోలీసు ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం ఎస్పీ గా జోగిందర్ శర్మ విధులు నిర్వహిస్తున్నారు.
4) ప్రస్తుతం భారత్ జట్టు లో గానీ, ఐపీఎల్ లో గాని సూపర్ ఫామ్ లో ఉండి పరుగుల వరద పారిస్తున్న వారిలో మొదటి స్థానం లో ఉంది కేఎల్ రాహుల్. కే ఎల్ రాహుల్ తన అద్భుతమైన ఫామ్ తో సీనియర్ క్రికెటర్ల ను కూడా వెనక్కి నెట్టి అనేక రికార్డులను కొల్లగోడుతున్నాడు. అంతే కాకుండా భారత క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కే ఎల్ రాహుల్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం ఉంది. దీని కోసం కే ఎల్ రాహుల్ పలు యాడ్స్ లలో కూడా కనిపిస్తాడు.
5) మరోకరు యుజ్వేంద్ర చాహల్, చాహల్ 2016 నుంచి భారత్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆయన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టే సామార్థ్యం ఉంది. భారత్ జట్టు లో పాటు ఐపీఎల్ లో కూడా చాహల్ కు మంచి రికార్డులు ఉన్నాయి. అయితే యుజ్వేంద్ర చాహల్ కు ఇన్ కమ్ టాక్స్ విభాగం లో ఒక ఉద్యోగం చేస్తున్నాడు.