Home » రామ్ చరణ్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్…ఆ సినిమా ఏదంటే…?

రామ్ చరణ్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్…ఆ సినిమా ఏదంటే…?

by AJAY
Ad

చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు. చరణ్ చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా చరణ్ కు నటుడిగా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రంగస్థలం సినిమాతో నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.

Advertisement

ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ స్టార్ గా మారాడు. అయితే హీరో అన్న తర్వాత కథలు వింటూ ఉంటారు కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చవు… నచ్చని కథలను హీరోలు రిజెక్ట్ చేస్తారు. అయితే అదే కథలో నటించి మరో హీరో సూపర్ హిట్ అందుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Advertisement

రామ్ చరణ్ కెరీర్ లోనూ అలాంటి ఓ సినిమా ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ కొట్టిన ఓ సినిమాను రాంచరణ్ మిస్ చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు. ప్రభాస్ కెరీర్ లో నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ డార్లింగ్ సినిమా.

మొదట ఈ సినిమా రామ్ చరణ్ వద్దకే వెళ్ళింది. కానీ రామ్ చరణ్ ఆ సినిమాను పక్కన పెట్టాడు. దాంతో ఆ సినిమా ప్రభాస్ వద్దకి వెళ్ళింది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పాటు ఇప్పటికీ అభిమానులు ప్రభాస్ ను డార్లింగ్ అని పిలుచుకుంటున్నారు.

Visitors Are Also Reading