తెలుగు, తమిళంలో దూసుకెళ్లిన సమంత తాజాగా హాలీవుడ్‌లో కూడా ఎంట్రి ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే సమంత ఆదిలాబాద్ జిల్లాలో ఓ చెలకలో ఉన్న చేనుకు కాపలా కాస్తుందని టాక్ వినిపిస్తోంది. కోట్ల రూపాయలు సంపాదించే సమంత చేనుకు కావలి ఉండుండేంది అని ఆశ్చర్యపోతున్నారా..? అవును అండి ఇది నిజమే..? 24 గంటలు పంటను కాపాడుతుందని జనం అనుకుంటారు ఇది మీరు నమ్మడం లేదా అయితే ఓసారి చెబుతా వినండి.
Advertisement
కేవలం హీరోయిన్ సమంతనే కాదు.. ఆమె పక్కనే మరొక హీరోయిన్ కృతిశెట్టి కూడా ఉన్నది. కావాలంటే ఇప్పుడు చూద్దాం రండి. ఆ పంట చేనులో సమంత, కృతిశెట్టిల బ్యానర్లను పెద్దగా ఏర్పాటు చేసారు. ఇది చూసిన వారికి ఎంతో ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. ఇటువైపు సమంత.. అటువైపు కృతిశెట్టి ఇద్దరూ పంటచేలకు కాపలా కాస్తున్నారు. ముఖ్యంగా మిర్చి, పత్తి పంటలను కాపాడేందుకు మనుషుల బొమ్మ, కుక్కల బొమ్మ ఇవన్నీ పెట్టినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. సినిమా హీరోయిన్‌లను పెట్టామని రైతు పేర్కొంటున్నాడు.
Advertisement
దిష్టిబొమ్మలను పెడితే అడవిపందులు, పక్షులు వాటిని గ్రహించి పంట చేలను నాశనం చేస్తున్నాయి. అదే హీరోయిన్ సమంత, ఉప్పెన ఫేమ్ హీరోయిన్ కృతిశెట్టి ఫోటోలను చూసి అవి మనుషులే అనుకుని అక్కడికి రాకుండా దూరంగా వెళ్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేశాడు రైతు. రోడ్డుమీదనే ఉన్న ఈ పొలంలో నలువైపులా కటౌంట్‌లను పెట్టడంతో ప్రజలందరూ ఈ పోస్టర్‌లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు పంటను కాపాడడానికి దిష్టిబొమ్మలు, పంట చేను చుట్టు చీరలు కట్టేవారు. కానీ అడవి పందులు వీటన్నింటిని లెక్క చేయకుండా పంట చేలను నాశనం చేయడంతో.. ఇప్పుడు ట్రెండ్ మారి ఇలా ప్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. కానీ సినిమాల్లో హీరోయిన్‌లను కాపాడుతుంటారు. అదే నిజజీవితంలో పంటలను మాత్రం హీరోయిన్‌లు కాపాడుతున్నారు. ఏదైతే ఏమిటి.. పంట భద్రంగా ఉంటే అదే చాలు అని రైతులు పేర్కొంటున్నారు. రైతన్నలు మీ పంటను జీవాలు, పక్షులు వంటివి నాశనం చేస్తుంటే.. మీరు కూడా మీకు నచ్చిన హీరోయిన్ నమ్ముకొని మీ పంటను కాపాడుకోండి మరింకెందుకు ఆలస్యం..!