ఏపీలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) జాబ్ మేళా ప్రకటించింది. ఈనెల 22 ఉదయం 10 గంటలకు నెల్లూరులో మరో జాబ్ మేళాను నిర్వహించనుంది. దీనికి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందట. ఈ జాబ్ మేల ద్వారా 140 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే విద్యార్హతలు ఏంటంటే..
గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్: ఈ సంస్థలో 100 ఖాళీలుగా ఉన్నాయి. ఇందులో మిషన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా టెన్త్, ఇంటర్, ఐటిఐ,డిప్లమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇందులో ముఖ్యంగా పురుషులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలని వారు ప్రకటించారు. ఉండాల్సిన వయసు 18 నుంచి 28 సంవత్సరాలు. ఎంపికైన వారికి నెలకు 11,500 నుంచి 13500 వరకు వేతనం. ఎంపికైన అభ్యర్థులు నాయుడుపేటలో వర్క్ చేయవలసి ఉంటుంది.
Advertisement
ప్రైవేట్ జాబ్స్: అపోలో ఫార్మసీ సంస్థల్లో 40 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్ రిటైల్ ట్రైని అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే 18 నుంచి 28 ఏళ్ళు ఉండాలి. ఎంపికైన వారికి 10000 నుంచి 20 వేల వరకు సాలరీ ఉంటుంది. ఎంపికైన వారు నెల్లూరులో పని చేయవలసి ఉంటుంది.
ఇతర వివరాలు:
– అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది..
– రిజిస్టర్ చేసుకున్న వారు ఈనెల 22 ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
– ఇంటర్వ్యూలను డిస్టిక్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫీస్ , అయ్యప్ప గుడి సెంటర్ దగ్గర, నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్నారు..
Advertisement
also read:పండంటి కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ.. రిలయన్స్ లో చేసే జాబ్ ఏంటంటే..?