టాలీవుడ్ లో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువగా ఆఫర్లను అందుకుంటూ ఉంటారు. అలాంటి లిస్టులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు. నెగిటివ్ రోల్స్ మరియు పోలీస్ పాత్రలలో రవి ప్రకాష్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ రవి ప్రకాష్ నటిస్తున్నారు. దూకుడు సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా పోలీస్ పాత్రలో నటించి రవి ప్రకాష్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో రవి ప్రకాష్ పోలీస్ పాత్రలలో నటించి మెప్పించారు.
Advertisement
ఇప్పటివరకు రవి ప్రకాష్ మొత్తం 200 కు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి అలరించారు. అంతేకాకుండా రవి ప్రకాష్ ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై శుభవేళ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. కానీ హీరోగా సక్సెస్ అవ్వలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి రవి ప్రకాష్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
గతంలో ఓ ఇంటర్వ్యూలో రవి ప్రకాష్ తన రియల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.. తాను ఏపీలోని విశాఖపట్నంలో జన్మించానని రవి ప్రకాష్ వెల్లడించారు. తన తల్లిదండ్రులు ఇప్పటికీ విశాఖపట్నంలోనే ఉంటున్నారని అన్నారు. ఇంతవరకు తాను విశాఖపట్నంలో చదువుకున్నానని… ఆ తర్వాత మాస్కోలో ఎంబిబిఎస్ చేశానని చెప్పారు.
ఆ తర్వాత హైదరాబాద్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేశానని తెలిపారు. కాగా కుటుంబ సభ్యులు స్నేహితుల ప్రోత్సాహంతో అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని వెల్లడించారు. తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యానని.. కానీ క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాతో నటుడిగా తనకు గుర్తింపు వచ్చిందని తెలిపారు.