Home » రష్మిక జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..కనీసం అవి కూడా కొనుక్కోలేని స్థితి నుండి..!!

రష్మిక జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..కనీసం అవి కూడా కొనుక్కోలేని స్థితి నుండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఎన్నో కష్టాలు అనుభవించింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేషనల్ క్రష్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ అమ్మడు సినిమాల్లోకి రాకముందు కటిక పేదరికం అనుభవించానని ఒక ఇంటర్వ్యూలో తన నిజ జీవితం గురించి అసలు విషయాలు బయట పెట్టింది. ప్రస్తుతం ఈమె చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.. ఇంతకీ ఆమె ఏం చెప్పిందయ్యా అంటే..

Advertisement

also read;కృష్ణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఇవే..!

సినిమాల్లోకి వచ్చాక డబ్బు బాగా సంపాదించాను. నాకు ఇష్టమైంది ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాను.. కానీ వృధా ఖర్చులు మాత్రం అస్సలు చేయను. ఎందుకంటే డబ్బు విలువ నాకు బాగా తెలుసు.. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదైనా కొనుక్కునే స్తోమత ఉంది. కానీ నా చిన్నతనంలో ఆ పొజిషన్ మాకు లేదు. కనీసం ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టపడేవారు మా నాన్న.. ఈ సందర్భంలో రెంటు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్లి మేము ఉండేవాళ్లం. ఆ విధంగా రెండు నెలలకు ఒకసారి ఇండ్లు మారేవాళ్లం. అలా అనేక ఇబ్బందులు పడ్డాం.. అంత ఇబ్బందుల్లో కూడా మా నాన్న నేను అడిగింది ఏదైనా కొనివ్వడానికి ముందుకు వచ్చేవారు.

Advertisement

కానీ నేనే ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకొని బొమ్మలు కూడా వద్దనుకునే దాన్ని. ఎందుకంటే కనీసం ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి.. ఆ పరిస్థితి నేను అనుభవిస్తూ ఎంతో కష్టపడి కసితో ఈ పొజిషన్ కు వచ్చాను. అందుకే డబ్బులు ఇప్పటికి వృధా చేయను.. డబ్బులు వస్తే దాన్ని దాచిపెట్టి మరీ ఇన్వెస్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది రష్మిక.. అయితే ఈమె మాటలు విన్న చాలా మంది నెటిజన్స్,అభిమానులు రష్మిక సినిమాల్లోకి రాకముందు ఇన్ని బాధలు పడిందా అంటూ వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ బొమ్మ కొనుక్కో లేని స్థాయి నుండి ఏకంగా ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగింది. ఏది ఏమైనా కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో పాల్గొనబోతోందని తెలుస్తోంది.

also read;కృష్ణ రెండో పెళ్లి సమయంలో ఇందిరా దేవి పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా ? 

Visitors Are Also Reading