తల్లిదండ్రల తరవాత మళ్లీ జీవిత భాగస్వామితోనే జీవితం మొత్తం గడపాల్సి ఉంటుంది. పాతికేళ్లు వచ్చేవరకి మాత్రమే తల్లి దండ్రుల వద్ద ఉంటారు. ఆ తరవాత తమకంటూ కొత్త జీవితం ప్రారంభించాల్సి ఉంటుంది. కాబ ట్టి అన్ని విషయాలను చూసి జాగ్రత్తగా పరిశీలించి ఎవరితో జీవితం అందంగా ఉంటుంది. ఎవరిని ఎంపిక చేసుకుంటే జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి అనేది చూసుకుని జీవిత భాగస్వామిని ఎంపికచేసుకోవాలి. కాగా ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతి ద్వారా ఎన్నో గొప్ప విషయాలతో పాటూ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో కూడా చెప్పాడు.
Advertisement
అవేంటో ఇప్పుడు చూద్దాం….ఏ మతమైనా ఓ మతాన్ని అనుసరించి అందులోని ఆచార వ్యవహరాలు కట్టుబాటులను ఫాలో అయ్యే వ్యక్తి కుటుంబాన్ని పద్దతిగా చూసుకుంటాడట. కాబట్టి అతడి ఆసక్తి అనాసక్తిని చూసి ఎంపికచేసుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. జీవిత భాగస్వామికి కచ్చితంగా సహనం ఉండాలని చాణక్యుడు పేర్కొన్నాడు.
Advertisement
ఎలాంటి పరిస్థితిని ఎదురుకోవాలన్నా సహనం అవసరం కాబట్టి కచ్చితంగా సహనం ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలని చాణక్యుడు పేర్కొన్నాడు. అంతే కాకుండా బాహ్య ఆకృతి చూసి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవద్దని చాణక్యుడు తెలిపాడు. బాహ్య ఆకృతి కొంతకాలమే ఉంటుందని…అంతర్గత ఆకృతి జీవితాంతం ఉంటుందని చాణక్యుడు పేర్కొన్నాడు.
కాబట్టి అంతర్గత ఆకృతిని చూసి ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నాడు. జీవిత బాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో నిర్ణయం మీరే తీసుకోవాలని చాణక్యుడు తెలిపాడు. జీవితాంతం కలిసి ఉండేది మీరే…ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదురుకోవాల్సింది కూడా మీరే కాబట్టి పెళ్ళి విషయంలో మీరే నిర్నయం తీసుకోవాలని చాణక్యుడు తెలిపాడు.