Home » లంచం తీసుకుంటూ దొరికిపోయిన‌ప్పుడు పింక్ క‌ల‌ర్ సీసాలతో ఎందుకు ఫోటో తీస్తారు…? దాని వెన‌క ఉన్న స్టోరీ ఇదే..?

లంచం తీసుకుంటూ దొరికిపోయిన‌ప్పుడు పింక్ క‌ల‌ర్ సీసాలతో ఎందుకు ఫోటో తీస్తారు…? దాని వెన‌క ఉన్న స్టోరీ ఇదే..?

by AJAY
Ad

ఎన్ని క‌ఠిన‌మైన చ‌ట్టాలు తీసుకువ‌చ్చినా ప్ర‌భుత్వాలు మారినా మ‌న దేశంలో లంచం తీసుకోవ‌డం ఇవ్వడాలకు అస‌లు పులిస్టాప్ ప‌డ‌దు. ఏ ప్ర‌భుత్వ ఆఫీసుకు వెళ్లినా అక్క‌డ పైసా ఇవ్వ‌నిదే ప‌ని జ‌ర‌గ‌దు. ప‌నిచేయాలంటే చేతులు త‌డ‌పాల్సిందే. ఈ విష‌యం చిన్న పిల్ల‌ల‌కు సైతం తెలుసు. త‌ర‌చూ వార్త‌ల్లో ఏసీబీ వ‌ల‌లో అవినీతి అధికారి….కోట్లు మింగేసిన ఎమ్మార్వో..ఇలాంటి హెడ్డింగ్ లు క‌నిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా పేప‌ర్ లో వ‌చ్చిన ఫోటోలో లంచం తీసుకున్న అధికారి సిగ్గుతో త‌ల వంచుకుంటాడు.

Advertisement

Advertisement

ఇక ఆయ‌న ప‌క్క‌న అధికారులు నిల‌బ‌డ‌తారు. అయితే లంచం తీసుకున్న వ్య‌క్తిని ప‌ట్టుకున్న స‌మ‌యంలో అధికారులు ఆయ‌న ముందు పింక్ క‌లర్ రంగు సీసాల‌ను డ‌బ్బు పై పెట్టి ఉంచుతారు. అలా అవినీతి అధికారి ముందు పింక్ క‌ల‌ర్ నీటితో నింపిన సీసాల‌ను ఎందుకు ఉంచుతారు అన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. దాంతో త‌ల‌లు ప‌ట్టుకుంటూ ఉంటారు. కాబ‌ట్టి అస‌లు ఆ రంగు సీసాల‌ను ఎందుకు పెడ‌తారు అనే విష‌యం ఇప్పుడు తెలుసుకుందాం….ఏసీబీ అధికారులు ముందుగా లంచం ఇచ్చే వారికి కొన్ని క‌రెన్సీ నోట్ల‌ను ఇచ్చి వాటినే అధికారికి లంచంగా ఇవ్వ‌మ‌ని చెబుతుంటారు.

   అయితే ముందుగా ఆ నోట్ల‌కు ఫినాల్ ప్త‌లీన్ అనే పౌడ‌ర్ ను రాస్తారు. ఆ పౌడ‌ర్ మ‌న క‌ళ్ల‌కి క‌నిపించ‌దు. ఇక అధికారి తన చేతితో లంచం తీసుకున్న వెంట‌నే అధికారులు వ‌చ్చి ప‌ట్టుకుంటారు. వారి చేతుల‌ను నీటిలో ముంచితే పింక్ రంగులోకి మారుతాయి. అలా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నామ‌ని చెప్ప‌డానికి సంకేతంగా పింక్ బాటిల్స్ ను దొరికిపోయిన అధికారి ముందు పెట్టి ఫోటో తీస్తారు. ఆ త‌ర‌వాత క‌రెన్సీ నోట్ల‌ను స్వాధీనం చేసుకుని అధికారిని విధుల్లో నుండి స‌స్పెండ్ చేస్తారు.

Visitors Are Also Reading