ఒకప్పుడు అమ్మాయిలను అబ్బాయిలు మాత్రమే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లను ఆడవాళ్లు మగవాళ్ళను మగవాళ్ళు పెళ్లి చేసుకుంటున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కల్చర్ విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే ఇండియాలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
రీసెంట్ గా హైదరాబాద్ లో ఇద్దరు యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వారిద్దరూ పెళ్లికి ముందు డేటింగ్ కూడా చేసినట్టు పేర్కొన్నారు. ఇక తాజాగా ఇద్దరు మహిళలు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…. రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన మీరా అనే మహిళా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ టీచర్ గా పనిచేస్తుంది.
Advertisement
Advertisement
కాగా అదే పాఠశాలలో చదువుకుంటున్న కల్పన అనే విద్యార్థినితో మీరాకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మీరా కల్పనను ప్రేమించింది. కొన్నేళ్ల క్రితం వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా కల్పన స్కూల్ పూర్తిచేసుకుని కాలేజికి వెళ్లినా ఒకరినొకరు విడిచి పెట్టలేదు.
ఇక ఇద్దరి మధ్య విడదీయలేనంత బంధం ఏర్పడటంతో మీరా కల్పన కోసం 2019లో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. అంతేకాకుండా తన పేరును ఆరవ కుంతల్ గా మార్చుకుంది. ఇక తాజాగా వీరిద్దరూ తమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వార్త మరియు ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి.