బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సింహా, లెజెండ్ తరువాత బోయపాటితో చేసిన చిత్రం కావడంతో ఈ మూవీపై ఉన్న అంచనాలను నిలబెడుతూ సినిమా బంపర్ హిట్ అయింది. ఈ మూవీ విజయోత్సవ సభను విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయోత్సవ సభకు ఉదయభాను యాంకరింగ్ చేశారు.
చాలా కాలం తరువాత మరలా ఉదయభాను తిరిగి విజయోత్సవ సభలకు యాంకరింగ్ చేయడం మొదలుపెట్టింది. బాలయ్యతో ఉన్న అనుబంధం కారణంగానే ఆమెకు అవకాశం వచ్చిందని కొంతమంది చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో ఉదయభాను, బాలకృష్ణ మధ్య ఏదో అఫైర్ ఉండేదని, అందుకే అప్పట్లో ఉదయభానుకు అవకాశాలు వచ్చేవని గుసగుసలు వచ్చాయి. ఉదయభాను సైతం బాలయ్య గురించి చాలా గొప్పగా నిత్యం చెబుతుండేది. ఇటీవల జరిగిన అఖండ విజయోత్సవ సభలో సైతం బాలయ్యను భారీగా పొగిడేసింది. బాలయ్య మనసున్న మహరాజు అని, కల్లాకపటం తెలియని వ్యక్తి అని పొగిడేసింది. ఏ కార్యక్రమానికి వచ్చానా అందరిలా కాకుండా అయిపోయే వరకు ఉండి అందరినీ ఆశీర్వదించి వెళ్తారని చెప్పింది ఉదయభాను.
Advertisement