కొంతమంది రిపోర్టర్లు వేసే ప్రశ్నలు సెలబ్రెటీలకు కోపం తెప్పిస్తాయి. అయితే అలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు కొందరు సెలబ్రెటీలు కోపాన్ని తమ హావభావాల్లో చూపిస్తే కొందరు మాత్రం కౌంటర్లు ఇస్తుంటారు. అలా రిపోర్టర్లకు కౌంటర్లు ఇచ్చిన టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం….
విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తరవాత ఆ సినిమాలో ఓ సీన్ ఎందుకు చేశారు…పాత్ర డిమాండ్ చేసిందా అంటూ ప్రశ్నించగా…టైంపాస్ కు చేశానంటూ సీరియస్ అయ్యారు. కోట్లు ఖర్చు పెట్టడం..షూటింగ్ లకు వెళ్లడం.. సినిమాలే టైంపాస్ కు చేస్తామంటూ కౌంటర్ ఇచ్చాడు.
Advertisement
రీసెంట్ గా రాజమౌళి ఆర్ఆర్ ఆర్ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కౌంటర్ ఇచ్చారు. మీ ప్రతి సినిమా కాపీ..సీన్ లు కాపీ అంటూ ప్రచారం జరుగుతుంది. దాన్ని ఈ సినిమాతో బ్రేక్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. దానికి రాజమౌళి అలాంటివి రాకపోతే ఆశ్చర్యపోవాలని..వివాదాలు రాకపోతే ఆశ్చర్యపోవాలని అన్నారు.
Advertisement
ఓ రిపోర్టర్ చిరంజీవితో మాట్లాడుతూ..ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ను మీరు ప్రశ్నిస్తే చూడాలని ఉంది. మీరు ప్రశ్నించే అవకాశం ఉందా అంటూ అడిగారు. దానికి చిరు కేవలం మీలో ఎవరు కోటీశ్వరుడిక సంబంధించి మాట్లాడాలని..ప్రెస్ మీట్ అందుకోసమే పెట్టామని అన్నాడు.
హీరో సిద్దార్థ్ ను మీడియా సమావేశంలో మీరు పడిపోయి మళ్లీ సినిమాలు చేస్తున్నారు అంటూ మాట్లాడగా వెంటనే సిద్ధార్థ్ లైఫ్ లో ఎవరూ పడిపోరు..నేను ప్రస్తుతం మీ ముందు కాలి మీద కాలు వేసుకుని మాట్లాడుతున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు.
సమంతను విడాకులకు ముందు ఓ రిపోర్టర్ మీరు పెళ్లి తరవాత లిప్ లాక్ సీన్స్ ఉంటే చేస్తారా అని ప్రశ్నించారు. దానికి సమంత ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదే ప్రశ్నను మీరు పెళ్లైన హీరోలకు వేస్తారా అంటూ కౌంటర్ ఇచ్చారు.