ఓ సినిమా షూటింగ్ కొరకు అన్న ఎన్టీఆర్ కులుమనాలి వెళ్లాలి. ఇలా ఎన్టీఆర్ ఎప్పుడు అవుట్ డోర్ షూటింగ్స్ వెళ్లిన ఆయనతో పాటుగా ఎవరినో ఒకరిని తీసుకెళ్తూ ఉంటారు. అలా ఓసారి మనాలికి వెళ్లే సమయంలో ఆయన వెంట ఆరాధన నిర్మాత పుండరీకాక్షయ, ఆయన సోదరుడు బలరాం ఉన్నారు. వీరితో పాటుగా బీవీ మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఆయన పూర్తి పేరు బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి. జాతకాలు చెప్పడంలో దిట్ట. కర్నూలు జిల్లాలో చాలా పేరు సంపాదించుకున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో ఆయనకు పరిచయాలు ఉంన్నాయి. అప్పటి సీఎం జలగం వెంగళరావు కూడా ఈయన స్నేహితుడే. కానీ ఇతగాడికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. ఎన్టీఆర్ మహానటుడే కాకుండా మహార్జాతకుడు అవుతారని ఆయన గట్టి నమ్మకం.
Advertisement
also read:మీ దాంపత్య జీవితంలో సమస్యలను తొలగించే 5 వాస్తు టిప్స్ ఇవే..!
Advertisement
ఈ విధంగా ఎన్టీఆర్ మోహన్ రెడ్డి స్నేహం ఒక్క రోజుతో ముగియలేదు. ఎన్టీఆర్ తుది శ్వాస వరకు ఆయన వెంటే ఉన్నారు. ఎన్టీఆర్ తో కలిసి చివరిసారి భోజనం చేసిన వ్యక్తి కూడా ఇతడే. ఒక రెండు రోజులు మోహన్ రెడ్డి కనిపించకపోతే ఎన్టీఆర్ చాలా లోన్లీ గా ఫీల్ అయ్యే వారట. ఫోన్ చేసి మరీ పిలిపించుకునే వారట. ఒకరోజు అవుట్ డోర్ షూటింగ్ వెళ్తున్న సమయంలో మాట్లాడుకుంటున్నారు. ఎంతోమంది ప్రజలు నన్ను దేవుడిగా కొలుస్తున్నారు. వారికి నేను ఏమి ఇవ్వగలను.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఎన్టీఆర్ మోహన్ రెడ్డి తో అన్నారు. దీంతో వెంటనే అందుకున్న మోహన్ రెడ్డి అన్నగారు మంచి నిర్ణయం తీసుకున్నారు.
మీరు గనక రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని అప్పుడే భవిష్యవాణి వినిపించారు. ఈ విధంగానే ఎన్టీఆర్ సీఎం అయ్యారు, ఆయన క్యాబినెట్ లో మోహన్ రెడ్డి మంత్రి అయ్యారు. అంతేకాకుండా మోహన్ రెడ్డి మాట వల్లే ఎన్టీఆర్ రెండవ వివాహానికి కూడా చేసుకున్నారట. రెండో వివాహం వల్ల రాజయోగం పడుతుందని చెప్పడంతో ఈ పని చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విధంగా ఎన్టీఆర్ మోహన్ రెడ్డిలా సన్నిహిత్యం ఎన్టీఆర్ తుది శ్వాస వరకు కొనసాగిందని చెబుతుంటారు.
also read: