బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటికే 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. సినిమా మొదటిరోజు రిలీజైన సమయంలో ఈ మూవీ డిఫరెంట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, డిఫరెంట్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ సినిమా అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. నైజాం, సీడెడ్, ఓవర్సీస్ ఏరియాల్లో అఖండ కలెక్షన్ల వర్షం కురిపిప్తోంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను అలరించింది.
సినిమా రిలీజ్‌కు ముందు బోయపాటి ఓ విషయం చెప్పారు. సినిమా రిలీజ్ తరువాత ఈ మూవీలో బాలకృష్ణ కూతురిగా నటించిన చిన్నారి దేష్ణ గురించే అందరూ మాట్లాడుకుంటారని చెప్పాడు. చెప్పిన విధంగా చిన్నారి దేష్ణ నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. చిన్నారి గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. చిన్నారి నటనకు బాలయ్యసైతం ముగ్ధులయ్యారట. చిన్నారిని చాలా ప్రేమగా చూసుకున్నారని చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. బాలయ్య విశ్వరూపానికి, థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాడవ్వడంతో సినిమా సూపర్ హిట్ సాధించింది.
Advertisement