ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ లను తీసుకువస్తూ యూజర్లను ఆకర్షిస్తోంది. యూజర్ లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అప్డేట్ లను తీసుకువస్తూ సేవలు అందిస్తోంది. అయితే వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటే ఖచ్చితంగా చూపిస్తుంది అన్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ నుండి వెళ్ళిపోయాక లాస్ట్ సీన్ కనిపించకుండా ఆప్షన్ ఉంది…అంతే కాకుండా ఆన్లైన్ లో ఉన్న సమయం లో కూడా లాస్ట్ సీన్ చూపించే సదుపాయం ఉంది. కానీ ఆన్లైన్ లో ఉన్నప్పటికీ…ఆన్ లైన్, లాస్ట్ సీన్ చూపించకుండా ఉండే ఆప్షన్ మాత్రం ఇదివరకు లేదు. అయితే ఇప్పుడు వాట్సాప్ ఆ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
Advertisement
ఈ ప్రైవసీ సెట్టింగ్ ద్వారా ఆన్లైన్ లో ఉన్నప్పటికీ ఇతరులు తెలుసుకునే అవకాశం ఉండదు. అంతే కాకుండా థర్డ్ పార్టీ యాప్ లు కూడా ట్రేస్ చేయకుండా ఉంటుంది. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలకు కూడా కొత్త ఫీచర్ తో చెక్ పడే అవకాశం ఉంది. ఇక ఈ ప్రైవసీ సెట్టింగ్ ను ఫోన్ లో పొందాలంటే ముందుగా యాప్ ను అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ త్వరగా సెట్టింగ్స్ లో ప్రైవసీ లోకి వెళితే హైడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక ఈ ఫీచర్ ను వాట్స్ఆప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
Advertisement