Home » భార్యాభ‌ర్త‌లు ఈ 3 విష‌యాల‌ను ఇత‌రుల‌తో అస్స‌లు షేర్ చేసుకోవ‌ద్ద‌ట‌..! షేర్ చేసుకుంటే ఏం జ‌రుగుతుందంటే..?

భార్యాభ‌ర్త‌లు ఈ 3 విష‌యాల‌ను ఇత‌రుల‌తో అస్స‌లు షేర్ చేసుకోవ‌ద్ద‌ట‌..! షేర్ చేసుకుంటే ఏం జ‌రుగుతుందంటే..?

by AJAY
Ad

ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలను తన చాణక్యనీతి ద్వారా తెలిపాడు. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలతో పాటు మానసికంగా ఎలా ఉండాలి. కుటుంబ జీవనంలో భార్యాభర్తలు ఎలా కలిసిమెలిసి ఉండాలి. కల‌హాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇలా సుఖమైన జీవనానికి అవ‌స‌ర‌మైన ప్రతి విషయాన్ని చెప్పారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఇత‌రులు మ‌నం చెప్పే మూడు విష‌యాల వ‌ల్ల మ‌న‌ల్ని చూసి న‌వ్వుకుంటార‌ని తెలిపారు. కొంతమంది తమ కుటుంబంలో జరిగిన ప్రతి విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటారు కానీ అలా చేయ‌కూడ‌దని తెలిపాడు. ముఖ్యంగా మూడు విషయాలు మాత్రం అసలు షేర్ చేసుకోవద్దని చాణ‌క్యుడు తెలిపాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను కష్టాలను ఇతరులతో షేర్ చేసుకోవద్దని చాణ‌క్యుడు తెలిపాడు. అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వాటి గురించి చర్చించాలని పేర్కొన్నాడు. స్నేహితులు బంధువులతో అలాంటి విషయాలు చెప్పడం ద్వారా వారికి చులకన అయ్యే అవకాశం ఉందని హెచ్చరించాడు. అంతే కాకుండా కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని పెద్ద‌లు చెబుతుంటారు.

ఆచార్య చాణ‌క్యుడు కూడా అదే విషయాన్ని చెప్పాడు. దానం చేసిన విషయాన్ని ఇతరులతో చెప్పుకుంటే కర్మ బారం తగ్గుతుందని తెలిపాడు. అంతే కాకుండా వైవాహిక‌ జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దని చాణక్యుడు తెలిపారు. భార్యాభర్తల మధ్య జరిగిన విషయాలను మూడో కంటికి తెలియకుండా చూసుకోవాలని తెలిపారు. లేదంటే ఆ కుటుంబంలో స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Visitors Are Also Reading