శ్రీరెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు. శ్రీరెడ్డి చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా వివాదాలతోనే పాపులారిటీని సంపాదించుకుంది. గతంలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంశం పై టాలీవుడ్ లో రచ్చ రచ్చ చేసింది. అంతే కాకుండా తనను కొంతమంది వాడుకున్నారు అంటూ ఆదారాలతో సహా బయటపెట్టింది. అందులో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ కూడా ఉన్నాడు.
Advertisement
అక్కడితో ఆగకుండా ఫిల్మ్ చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి మీడియాలో శ్రీరెడ్డి హాట్ టాపిక్ గా మారింది. దాంతో జాతీయ మీడియా సైతం శ్రీరెడ్డి న్యూస్ ను కవర్ చేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ కు దూరంగా ఉంటూ శ్రీరెడ్డి తన మకాం చెన్నైకి మార్చింది. అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఓ యూట్యూబ్ చానల్ ను ప్రారంభించి వీడియోలు చేస్తోంది. వంటల వీడియోలతో పాటూ రాజకీయ సామాజిక అంశాలపై కూడా తనదైన స్టైల్ లో స్పందిస్తోంది.
Advertisement
కాగా ఎప్పుడూ పవన్ ను విమర్శించే శ్రీరెడ్డి మొదటిసారి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. రీసెంట్ గా వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ ఓ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ తో పాటూ ఆయన ఫ్యామిలీని ఆకరికి పిల్లలను సైతం దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా వైసీపీ అభిమానులు సైతం అనిల్ చేసిన పనికి ఫైర్ అయ్యారు. కాగా ఇదే టాపిక్ పై శ్రీరెడ్డి మాట్లాడుతూ..నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఆడాళ్లు, పిల్లల జోలికొస్తే తొక్క తీస్తా కొడకా అంటూ ఫైర్ అయ్యింది.
నేను ఏ పార్టీలో ఉన్నా మహిళలను కించపరిస్తే ఊరుకోను. పవన్ కల్యాణ్ మాజీ భార్యను పిల్లలను వైసీపీలోని అనిల్ అనే దరిద్రుడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. వీడు వైసీపీ పార్టీ పేరు చెప్పుకుని బెదిరింపులకు పాల్పపడుతున్నాడు. అసలు వీడెవడువీడి స్థాయి ఏంటి. పెళ్లాం పిల్లలతో నీకేం పనిరా.. మూడు పెళ్లిళ్లు చేసుకుంది పవన్ దమ్ముంటే ఆయన్ను తిట్టు. పెళ్లాం పిల్లల జోలికి వస్తే నరుకుతా…జగన్ అన్న ఇలాంటివి ఎంకరేజ్ చేయడు అంటూ శ్రీరెడ్డి వీడియోలో చెప్పుకొచ్చింది.