బిగ్ బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా ప్రసారమవుతుంది. ఇక ఈ సీజన్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో సుదీప కూడా ఉన్నారన్న సంగతి తెలిసిందే. సుదీప అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ నువ్వు నాకు నచ్చావ్ సినిమా పింకీ అంటే మాత్రం చాలా మంది వెంటనే గుర్తుపడతారు. సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా పింకీ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. బ్రహ్మానందం, వెంకటేష్ తో పింకీ చేసే కామెడీ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
Advertisement
ఈ సినిమా కంటే ముందు.. ఆ తర్వాత సుదీప చాలా సినిమాలలో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు రీఎంట్రీ కోసం బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. రీసెంట్ గా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన సుదీప పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఇంటర్వ్యూలో సుదీప ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన మొదటి సినిమా ఎం ధర్మరాజు ఎంఏ అని చెప్పింది.
Advertisement
ఈ సినిమా రచయిత తన తాత గారికి పరిచయం అని తెలిపింది. ఈ సినిమా కోసం చెన్నై నుండి రావాల్సిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని…. దాంతో ఆ ఆఫర్ తనకు వచ్చిందని తెలిపింది. ఈ సినిమా తర్వాత తాను 7/g బృందావన కాలనీ సినిమాలో ఆఫర్ అందుకున్నట్టు తెలిపింది. ఈ చిత్రం కోసం సన్నబడాలి…. నల్లగా ఉండాలని కండిషన్ పెట్టారని తెలిపింది. దాంతో తాను ప్రతిరోజు ఎండలో గంట సేపు నిలబడేదాన్నని పేర్కొంది. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ హవా ఉండేదని పేర్కొంది. ఉదయ్ కిరణ్ చేతిలో 9 సినిమాలు ఉన్నాయని వెల్లడించింది.
అయితే అందులో ఐదు సినిమాల్లో నటించడానికి తాను సైన్ చేశానని తెలిపింది. కానీ ఏమైందో ఏమో కానీ మధ్యలో చాలా సినిమాలు ఆగిపోయాయని పేర్కొంది. ఉదయ్ కిరణ్ తో కలిసి తాను చివరగా వియ్యాలవారికయ్యాలు సినిమాలో నటించానని తెలిపింది. ఉదయ్ కిరణ్ చాలా మంచివాడని సాఫ్ట్ మనిషి అని పేర్కొంది. కాస్త డల్ గా కనిపిస్తే దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగేవారని పేర్కొంది. ఏం బాధ వచ్చిందో ఏమో కానీ చిన్న ఆత్మహత్య చేసుకుని మనందరికీ దూరమయ్యాడు అని బాధపడింది.