చిత్ర పరిశ్రమలో ప్రేమలు మరియు పెళ్లిళ్లు అనేది కామన్. అలాగే బ్రేక్ అప్ లు కూడా చాలా కామన్. కొందరైతే ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకొని… పెళ్లి వరకు వచ్చాక కూడా విడిపోతారు. సాధారణ మనిషిలో ఇలాంటి సంఘటనలు తక్కువైన సెలబ్రిటీల మధ్య ఈ రోజు ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి.. గొడవ పడి… విడి పోతూ ఉంటారు. అయితే ఇలా ప్రేమించుకుని పెళ్లి వరకు వచ్చి పెళ్లి చేసుకోకుండా… విడిపోయిన కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.
రక్షిత్-రష్మిక
Advertisement
రక్షిత్-రష్మిక కలిసి నటించిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఆ టైం లోనే వీరు ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఆ తరువాత రష్మిక కెరీర్ మారిపోయింది దీంతో ఆమె రక్షిత్ బ్రేకప్ చెప్పేసి పూర్తిగా సినిమాలు చేసింది.
అఖిల్ – శ్రీయా భూపాల్ : అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్.. ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు భూపాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటలీలో అంగరంగ వైభవంగా వీరి పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలోనే మనస్పర్థలు రావడంతో వీరు విడిపోయారు. ఆతర్వాత శ్రీయ చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుని పెళ్లి చేసుకోంది.
Advertisement
మెహరీన్ – భవ్య బిష్ణోయ్ :
క్రేజీ హీరోయిన్ మెహరీన్ కు.. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయు కు ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మెహరీన్ కు పెళ్లి నచ్చక ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకోండి.
తరుణ్- ఆర్తి అగర్వాల్ : తరుణ్, దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ ప్రేమించుకున్నారు. సోగ్గాడు, నువ్వు లేక నేను లేను సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరు పెళ్లి చేసుకుంటారా అనుకుంటున్న టైమ్ లోనే.. తరుణ్ రోజా రమణి కి నచ్చలేదు. దీంతో వారి పెళ్లి క్యాన్సిల్ అయింది.
ప్రభుదేవా-నయనతార : శింబు తో.. బ్రేకప్ తర్వాత నయనతార ప్రభుదేవా ను ప్రేమించింది. నయనతార ను పెళ్లి చేసుకునేందుకు ప్రభుదేవా తన భార్య రమలత్ కు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత నయనతార తో గ్యాప్ రావడంతో విడిపోయారు.